హీరో విశాల్ వివాదాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన్ని వివాదాలు వదలడం లేదు. తమిళనాట రాజకీయ పరంగా, సినిమాల పరంగా పలు వివాదాల్లో విశాల్ పేరు వినిపిస్తూనే ఉంటుంది.

హీరో విశాల్ వివాదాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన్ని వివాదాలు వదలడం లేదు. తమిళనాట రాజకీయ పరంగా, సినిమాల పరంగా పలు వివాదాల్లో విశాల్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. విశాల్ కి తమిళంతో పాటు తెలుగులో కూడా సమానమైన క్రేజ్ ఉంది. అందుకే విశాల్ నటించే చిత్రాలు తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. 

తాజాగా విశాల్ కి ఒక పాత కేసు నేపథ్యంలో ఊరట లభించింది. కొన్నేళ్ల క్రితం విశాల్.. అన్బు చెళియన్ అనే ఫైనాన్షియర్ వద్ద తన నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ కోసం రూ 21 కోట్లు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ రుణాన్ని లైకా నిర్మాణ సంస్థ సదరు ఫైనాన్షియర్ కి చెల్లించింది. దీనికి ప్రతిఫలంగా లైకా.. విశాల్ తో ఒక ఒప్పందం చేసుకుంది. తమ డబ్బు చెల్లించే వరకు విశాల్ నటించే చిత్రాల పంపిణి హక్కులు తమకే సొంతం అన్నట్లుగా ఒప్పందం చేసుకున్నారు. 

కానీ ఈ ఒప్పందాన్ని అతిక్రమిస్తూ విశాల్ తన ' సామాన్యుడు' చిత్రాన్ని రిలీజ్ చేసుకున్నాడు. దీనితో లైకా సంస్థ కోర్టుని ఆశ్రయించింది. దీనితో విశాల్ 15 కోట్లు లైకా సంస్థకి ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు వివాదంపై విశాల్ ఈ సారి ఆధారాలతో కోర్టుని ఆశ్రయించారు. తమ నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి చిత్రాలు నిర్మించలేదని విశాల్ తరపున న్యాయవాది.. జడ్జి సెలందర్ ముందు ఆధారాలతో వాదనలు వినిపించారు. 

కానీ లైకా సంస్థ కౌంటర్ గా ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. దీనితో సెలందర్.. విశాల్ రూ 15 కోట్లు డిపాజిట్ చేయాలన్న కేసుని కొట్టివేశారు. ఇదిలా ఉండగా లైకా సంస్థకి చెల్లించాల్సిన అప్పు వివాదంపై ఈ నెల 26న విచారణ ఉంటుందని ఆదేశించారు. దీనితో విశాల్ కి ఈ కేసులో కొంత భాగం ఊరట లభించింది. 

ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోని, తుప్పరివాళన్ (తెలుగులో డిటెక్టివ్ 2)2 చిత్రాల్లో నటిస్తున్నాడు. విశాల్ ఇటీవల ఎక్కువగా థ్రిల్లర్ కథలకే ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.