Asianet News TeluguAsianet News Telugu

నాకు అలాంటి అమ్మాయి భార్యగా కావాలి... మరి కత్రినా పరిస్థితి ఏంటి, వదిలేసినట్టేనా?

ఓ ప్రక్క కత్రినా కైఫ్ తో హీరో విక్కీ కౌశల్ వివాహం లాంఛనమే అని వార్తలు వస్తుండగా, అతడు తనకు కాబోయే భార్య ఇలా ఉండాలని, ప్రత్యేక లక్షణాలను ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు విక్కీ, కత్రినా పెళ్లి చేసుకుంటారా లేదా అనే సందేహం మొదలైంది...

hero vicky kausal made interesting comments amid of marriage with katrina kaif
Author
Hyderabad, First Published Nov 13, 2021, 11:28 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రెండేళ్లకు పైగా కత్రినా కైఫ్ (Katrina kaif) , విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం సాగుతుంది. ఈ జంట తమ రిలేషన్ అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ... విందులు, వినోదాలలో కలిసి పాల్గొంటూ, హింట్ ఇచ్చారు. కలిసి విదేశీ విహారాలకు కూడా చెక్కేస్తున్న ఈ లవ్ బర్డ్స్ ఎల్లలు లేని స్వేచ్చా జీవితం గడుపుతున్నారు. ఈ క్రమంలో కత్రినా, కౌశల్ పెళ్లి వార్తలు తరచుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 
తాజాగా కత్రినా-విక్కీ(Vicky kaushal) పెళ్ళికి సిద్ధమయ్యారని, దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తి చేశారని వార్తలు వస్తున్నాయి. ఇక వీరి వివాహానికి రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెన్సు ఫోర్ట్ బర్వార వేదిక కానుందని, ఫేమస్ డిజైనర్ ని కలిసి, పెళ్లి బట్టలు సిద్ధం చేయింస్తున్నారని పలు కథనాలు వెలువడ్డాయి. డిసెంబర్ విక్కీ,కత్రినా పెళ్లి చేసుకొని, భార్యాభర్తలుగా మారడం ఖాయమే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. 


అయితే అడ్వెంచరస్ ప్రోగ్రాం ఇన్ టు ది వైల్డ్ లో విక్కీ కౌశల్ పాల్గొన్నారు. సాహసికుడిగా పేరున్న బేర్ గ్రిల్స్(Bear grylls) తో కలిసి కఠిన పరిస్థితుల మధ్య అడవిలో సాహస యాత్ర చేశారు. కాగా ఈ షోలో బేర్ గ్రిల్స్... విక్కీని ఎటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నావ్ అని అడిగారు.  దానికి విక్కీ... కుటుంబంలో కలిసిపోయి, సుఖ సంతోషాలు, కష్ట నష్టాల్లో ప్రేమిస్తూ తోడుగా ఉండి, అర్థం చేసుకునే అమ్మాయి కావాలని సమాధానం చెప్పాడు. ఓ పక్క కత్రినాతో పెళ్లి అని వార్తలు వస్తుండగా, విక్కీ కౌశల్ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. అసలు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అనే సందేహం మొదలైంది. గతంలో కత్రినా రన్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్ వంటి నటులతో రిలేషన్ లో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.

 Also read తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్
అక్షయ్ కుమార్ (Akshay kumar) కి జంటగా కత్రినా నటించిన లేటెస్ట్ మూవీ సూర్యవంశీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఆమె ఫోన్ బూత్ తో పాటు సల్మాన్(Salman khan) కి జంటగా టైగర్ 3 మూవీలో నటిస్తున్నారు. విక్కీ కౌశల్ సర్దార్ ఉద్ధమ్ చిత్రంతో హిట్ అందుకున్నారు. గోవిందా నామ్ మేరా, ది గ్రేట్ ఇండియా ఫ్యామిలీ చిత్రాలలో నటిస్తున్నారు. కెరీర్ పరంగా ఇద్దరూ సక్సెస్ ఫుల్ ట్రాక్ లో ఉన్నారు. 

Also read ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడతారు, కరీనా అంతలా టెంప్ట్ చేస్తోందా!

Follow Us:
Download App:
  • android
  • ios