అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ‘జాతిరత్నాలు’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అనుదీప్ (Andeep). ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందిన ఆయన టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ సెట్ అయినట్టు తెలుస్తోంది.


కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు యంగ్ డైరెక్టర్ అనుదీప్ (Anudeep). 2016లో ‘పిట్టగొడ్డ’ చిత్రంతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఆ తర్వాత వచ్చిన ‘జాతిరత్నాలు’ (Jathiratnalu) చిత్రంతో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో అనుదీప్ డైరెక్షన్ లో నటించేందుకు బడా స్టార్స్ కూడా ముందుకు వస్తున్నారు. ఇటు ప్రేక్షకులు కూడా కామెడీ ఫిల్మ్స్ పై కాస్తా ఆసక్తి చూపుతుండటంతో అనుదీప్ లాంటి దర్శకులకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. 

తాజాగా అనుదీప్ బంపర్ ఆఫర్ దక్కిచుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh)తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తన శిష్యుడు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రంతో దర్శకుడిగా మారాయి. ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో మాట్లాడుతూ అనుదీప్ క్రేజీ న్యూస్ అందించాడు. త్వరలోనే విక్టరీ వెంకటేశ్ తో సినిమా చేయబోతున్నట్టు చెప్పారు. ఇందుకోసం స్క్రిప్ట్ కూడా రెడీ ఉందని, త్వరలోనే స్టోరీ నెరేషన్ చేస్తానని చెప్పారు. వెంకటేశ్ తోనూ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ నే తెరకెక్కించబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే నవీన్ పొలిశెట్టితో వెండితెరపై నవ్వులు పూయించిన అనుదీప్.. ఇక వెంకటేశ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు మరిచిపోలేని చిత్రాన్ని అందించనున్నాడు. 

విక్టరీ వెంకటేశ్ - అనుదీప్ కాంబినేషన్ లో సినిమా ఒకే అవ్వాలని ఇటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే వెంకీ ‘ఎఫ్3’తో ప్రేక్షకులను అలరించారు. తన తదుపరి చిత్రంపై ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు.. ఈ క్రమంలో అనుదీప్ ఈ న్యూస్ రివీల్ చేయడం వెంకీ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ప్రస్తుతం అనుదీప్ తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయతో ‘ప్రిన్స్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ అనంతరం వెంకీ సినిమాను పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది.