Asianet News TeluguAsianet News Telugu

స్టార్స్ కూడా షాక్ అయ్యేలా వరల్డ్ రికార్డు కొట్టిన వెంకీ కూతురు ఆశ్రిత!

సెలబ్రిటీకి ఉండే పాపులారిటీ, ఫాలోవర్స్ సంఖ్యను బట్టి, వారి ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి ఆదాయం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు తమ ఒక్కో ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారనే విషయాన్ని హోపర్ డాట్ కామ్ అనే సంస్థ లిస్ట్ విడుదల చేసింది. 
 

hero vekantesh daughter ashrita achieves a record here are details ksr
Author
Hyderabad, First Published Jul 5, 2021, 7:33 AM IST

విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత అరుదైన రికార్డు అందుకున్నారు. ఆమె వరల్డ్ ఇంస్టాగ్రామ్ రిచ్ లిస్ట్ లో చోటు సంపాదించారు. విషయంలోకి వెళితే అత్యంత ప్రజాదరణ కలిగిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా సెలెబ్రిటీలు సంపాదన ఆర్జిస్తున్నారు. ఓ సెలబ్రిటీకి ఉండే పాపులారిటీ, ఫాలోవర్స్ సంఖ్యను బట్టి, వారి ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి ఆదాయం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు తమ ఒక్కో ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారనే విషయాన్ని హోపర్ డాట్ కామ్ అనే సంస్థ లిస్ట్ విడుదల చేసింది. 


ఈ లిస్ట్ లో అందరికంటే అత్యధిక సంపాదనతో ఫుట్ బాల్ స్టార్ రోనాల్డో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఇండియా నుండి అత్యధిక ఇంస్టాగ్రామ్ సంపాదన కలిగిన సెలెబ్రిటీలుగా ప్రియాంకా చోప్రా, విరాట్ కోహ్లీ నిలిచారు. కాగా ఈ లిస్ట్ లో వెంకటేష్ కూతురు ఆశ్రిత ప్రపంచంలో 377వ స్థానంలో నిలిచింది. ఇక ఆసియా లెవెల్ లో 27వ ర్యాంక్ రాబట్టడం విశేషం. 


కుకింగ్ లో ఎక్స్పర్ట్ అయిన ఆశ్రిత కొద్దిరోజుల క్రితం ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. వరల్డ్ ఫేమస్ డిషెష్ ప్రిపరేషన్స్ కి సంబంధించిన వీడియోలు ఆమె యూట్యూబ్ తో పాటు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. 13లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఆశ్రిత ఒక్కో వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ద్వారా 400 డాలర్స్ వరకు అందుకంటున్నారట. దీనితో ఇంస్టాగ్రామ్ రిచ్ లిస్ట్ లో వెంకటేష్ కూతురు చోటు సంపాదించారు. 


ఇక 2019లో ఆశ్రిత వినాయక్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఆమె భర్త వినాయక్ రెడ్డితో కలిసి స్పెయిన్ లోని బార్సిలోనా లో ఉంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios