పెళ్లి తర్వాత వరుణ్ ని ఇబ్బంది పెడుతున్న లావణ్య... స్వేచ్ఛ కోల్పోయాను అంటున్న మెగా హీరో!
మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉందో తాజాగా వెల్లడించారు. లావణ్య కారణంగా ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
వరుణ్ తేజ్ ఐదేళ్లకు పైగా ప్రేమించి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నాడు. మిస్టర్ మూవీలో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇన్నాళ్లు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కారు. గత ఏడాది నవంబర్ నెలలో వరుణ్ తేజ్-లావణ్యల వివాహం ఇటలీ దేశంలో జరిగింది. మెగా హీరోలందరూ హాజరైన ఈ పెళ్లి నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది.
కాగా మొదటిసారి పెళ్లి తర్వాత జీవితంలో ఎలా ఉందో వరుణ్ తేజ్ వెల్లడించారు. వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు సిద్ధం కాగా... ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ... పెళ్లి అనంతరం జీవితంలో వచ్చిన మార్పులు ఏంటని అడిగారు. సుమ ప్రశ్నకు వరుణ్ తేజ్ ఫన్నీగా సమాధానం చెప్పారు. ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎక్కడికి వెళుతున్నావనే ప్రశ్న పదే పదే ఎదురవుతుందని.. .చెప్పాడు.
వరుణ్ తేజ్ కామెంట్స్ గమనిస్తే లావణ్య కొంత ఇబ్బంది పెడుతుందని. వరుణ్ తేజ్ స్వేచ్ఛ కోల్పోయాడనే భావన కలుగుతుంది. భార్య అన్నాక తప్పదు మరి. గంటకో కాల్ చేయడం. షర్ట్ వేసుకోగానే ఎక్కడకు అని అడగటం వెరీ కామన్. అందరు భర్తల వలె వరుణ్ ఈ తరహా అనుభవాలు ఎదుర్కొంటున్నాడన్న మాట. ఈ ఇంటర్వ్యూలో మరికొన్ని విశేషాలు వరుణ్ తేజ్ పంచుకున్నారు.
స్క్రిప్ట్ సెలక్షన్ లో పెదనాన్న చిరంజీవి తనకు స్ఫూర్తి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ బాబాయ్ లోని నిజాయతీ నచ్చుతాయని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ఒప్పుకోక ముందు పుల్వామా సంఘటన గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఇప్పుడు పూర్తిగా ఆ సంఘటన గురించి తెలుసు... అని వరుణ్ తేజ్ అన్నారు.
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాన్ని తెరకెక్కించారు. వరుణ్ కి జంటగా మానుషీ చిల్లర్ నటిస్తుంది. భారత వైమానిక దళ సాహసాలు ప్రధానంగా ఆపరేషన్ వాలెంటైన్ తెరకెక్కింది. ఈ మూవీ మార్చి 1న విడుదల కానుంది.