హీరో వరుణ్ తనదైన శైలిలో వాలెంటైన్స్ డే విషెస్ చెప్పాడు. అనూహ్యంగా తన లవర్ ని పరిచయం చేశాడు. ఆ ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ప్రేమికులరోజు బెస్ట్ విషెస్ తో సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ నిండిపోయాయి. టాలీవుడ్ సెలెబ్స్ ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనూహ్యంగా వరుణ్ తన లవర్ ని పరిచయం చేశాడు. అయితే ఆయన లవర్ అమ్మాయి కాదు లెండి. అది వ్యాయామశాల. జిమ్ ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వరుణ్ తేజ్ 'హ్యాపీ వాలెంటైన్స్ డే' అని కామెంట్ పోస్ట్ చేశాడు. అలాగే హార్ట్ సింబల్ జోడించారు. ప్రేమికులరోజు వేళ తనకు ఇష్టమైన, ప్రేమించే ప్రదేశాన్ని పరిచయం చేశాడన్నమాట.
ఆ మధ్య వరుణ్ తేజ్ మీద ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపించాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తున్న వరుణ్ పెళ్ళి చేసుకోబోతున్నాడంటూ కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ తరచుగా ప్రైవేట్ పార్టీలలో పాల్గొనడం, నిహారిక వివాహానికి లావణ్య హాజరుకావడం వంటి పరిణామాలు ఈ రూమర్స్ కి బీజం వేశాయి. వరుణ్ ఈ వార్తలపై నోరుమెదపలేదు. అయితే లావణ్య ఖండించారు. వరుణ్ తో పరిచయం ఉంది కానీ అది ప్రేమ కాదు. మేము వివాహం చేసుకోవడం లేదని స్పష్టత ఇచ్చారు.
ఇటీవల నాగబాబు వరుణ్ వివాహం పై స్పందించారు. త్వరలో వరుణ్ వివాహం చేస్తామంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు వరుణ్ కెరీర్ కొంచెం డల్ అయ్యింది. ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 విజయాలతో వరుణ్ రేసులోకి దూసుకొచ్చాడు. అయితే ఆయన గత రెండు చిత్రాలు ప్లాప్ ఖాతాలో చేరాయి. గని టైటిల్ తో చేసిన స్పోర్ట్స్ డ్రామా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా కోసం వరుణ్ ఎంతగానో శ్రమించాడు. కథలో కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు.
ఎఫ్ 3 సైతం అంచనాలు అందుకోలేకపోయింది. మంచి ఓపెంగ్స్ రాబట్టిన ఈ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ బ్రేక్ ఈవెన్ కాలేదు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. గాండీవధారి అర్జున టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం వరుణ్ కి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
