Asianet News TeluguAsianet News Telugu

మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హీరో తరణ్.. ?

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరోలలో టాప్ లో ఉండేవాడు తరుణ్. రాను రాను.. వరుస ఫెయిల్యూర్స్ తో తెరమరుగయ్యాడు. ఇక చాలా కాలం తరువాత ఆయన రీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో..?
 

Hero Tarun Re Entry with Mahesh Babu Movie
Author
First Published Aug 29, 2022, 12:47 PM IST

ఒకప్పటి లవర్ బాయ్, యంగ్ హీరో.. తరుణ్ చాలా కాలంగా వెండి తెరకు దూరంగా ఉంటున్నాడు. ఇక ఈ హీరో త్వరలో రీ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అప్పటికి ఇప్పటికీ.. క్రేజ్ పరంగా.. లుక్ పరంగా చాలా మారిపోయిన తరుణ్.. ఫిల్ నెస్ కోల్పోయాడు. అయితే తరుణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా...? లేక సెకండ్ హీరోగానా..? లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా..?అని చర్చమొదలయ్యింది. అయితే తరుణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.  

మహేశ్ బాబు హీరోగా ఆయన 28వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓపెనింగ్ చేసుకున్న ఈ సినిమా.. వచ్చేనెల 2వ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వరుసగా ఇచ్చినత్రివిక్రమ్ చేస్తున్న సినిమా  కావడంతో... ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్రివిక్రమ్ ఈసినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనిచూస్తున్నాడు. ఇంకో విశేషం ఏంటీ అంటే..? మహేష్ బాబుతో త్రివిక్రమ్  కాంబినేషన్లో  రూపొందుతున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే అలరించనుంది.

అయితే  త్రివిక్రమ్ కు ఓ అలవాటు ఉంది.. ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నింటిలో.. మెయిన్ హీరోతో పాటు.. సెకండ్ హీరోను కూడా తీసుకుంటున్నాడు. సెకండ్ హీరోయిన్ లను కూడా తీసకుంటున్నాడు. అలవైకుంఠపురములో సినిమాలో సుశాంత్ తో పాటు నివేదా పేతురాజ్ ను తీసుకున్నాడు.. ఇలానే ఈసారి మహేష్ తో చేయబోయే సినిమాలో కూడా ఓ యంగ్ హీరోను తీసుకునే ప్లాన్ లో ఉన్నాడట మాటల మాత్రికుడు. ఈక్రమలోనే  ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆయన  హీరో తరుణ్ ను తీసుకున్నట్టుగా సమాచారం. 

బాలనటుడిగా  వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. హీరోగా  తెలుగులో తరుణ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు స్టార్ హీరో ఇమేజ్ కూడా సాధించాడు. కెరీర పీక్స్ లో ఉండగానే.. వరుసగా ప్లాప్ లు పడటం, కోన్ని వివాదాల కారణంగా తరుణ్ ఫిల్మె కెరీర్ చిన్నగా డౌన్ అవుతూ వచ్చింది.  అలాంటి తరుణ్ మళ్లీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపిస్తుంది. కెరీర్ బిగినింగ్ లో  త్రివిక్రమ్.. తరుణ్ హీరోగా 'నువ్వే నువ్వే చేశారు. ఈ సనిమాతోనే త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అలాంటిది కెరీర్ లో ఓడిదుడుకులు ఫేస్ చేస్తున్న తరుణ్ కు  త్రివిక్రమ్  తన సినిమాతోనే రీ ఎంట్రీ  అవకాశం ఇచ్చి మరో సారి లైఫ్ ఇస్తుండటం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios