బిగ్ బాస్ షోపై తరుణ్ ఏం అన్నాడంటే!

hero tarun comments on big boss
Highlights

ఒకప్పుడు లవర్ బాయ్ గా గుర్తింపు పొందిన హీరో తరుణ్ కు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండేది

ఒకప్పుడు లవర్ బాయ్ గా గుర్తింపు పొందిన హీరో తరుణ్ కు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండేది. అదే స్థాయిలో వివాదాలలో కూడా ఇరుక్కున్నాడు ఈ నటుడు. ఇండస్ట్రీలో కొత్త హీరోలు ఎక్కువవ్వడం.. తరుణ్ క్రేజ్ తగ్గిపోవడంతో హీరోగా అవకాశాలు తగ్గాయి. రీసెంట్ గా ఓ సినిమా ట్రై చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు. అయితే ఈ హీరో బిగ్ బాస్ సీజన్ 2లో పోటీదారుడిగా కనిపించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై స్పందించిన ఈ హీరో.. తను బిగ్ బాస్ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. నిజానికి బిగ్ షో లో పార్టిసిపెంట్ చేసే ఇంటెన్షన్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదని  తెలిపారు. సో ఈ అనౌన్స్ మెంట్ తో బిగ్ బాస్ లో తరుణ్ ఉన్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది.

loader