Asianet News TeluguAsianet News Telugu

పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగుతున్న సూర్య, ఈసారి కూడా ప్రయోగమే..?

సూర్య పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నాడు. ఆడియన్స్ పల్స్ ను బట్టి సినిమా చేస్తున్నాడు. గెలుపోటములు ముఖ్యం కాదు అంటున్నాడు. అందుకే ఈ సారి కూడా ప్రయోగానికి పదును పెడుతున్నాడు. 

Hero Surya New Movie Update
Author
Hyderabad, First Published May 25, 2022, 2:33 PM IST

కోలీవుడ్లో కొత్తదనం కోసం తపించే  హీరోలలో కమల్ హాసన్, విక్రమ్ తరువాత స్థానంలో సూర్య చేరిపోయాడు.  సినిమా కోసం,  ఆ సినిమాలో పాత్ర కోసం.. సూర్య ఎంత కష్టపడటానికైనా వెనుకాడడు. ప్రయోగాత్మక పాత్రలను చేయడానికి సూర్య ఏమాత్రం ఆలోచించడు. ఆయన చేసిన ఎక్స్ పెర్మెంటల్ మూవీస్ లో సెవెంత్ సెన్స్, సూర్య సన్నాఫ్ కృష్ణన్' 24, జై భీమ్, ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఈ సినిమాలు సూర్య టాలెంట్ కు మచ్చు తునకల్లాంటివి.  

ప్రస్తుతం సూర్య బాలా డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా కూడా విభిన్నమైనదే. ఆ తరువాత వెట్రిమారన్ ను ఆయన లైన్లో పెట్టేశాడు. ఈ సినిమా రన్నింగ్ లో ఉండగానే మరో డైరెక్టర్  శివతో  సినిమా చేయడానికి సూర్య రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. శివకి మాస్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ ఉంది. అజిత్ కి వరుస హిట్లు ఇచ్చిన రికార్డు ఆయన ఖాతాలో ఉంది. ఆయన వినిపించిన కథ సూర్యకి బాగా నచ్చిందట. దాంతో సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 

చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడట. రెండు పాత్రలలో వేరియేషన్ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఒక పాత్ర కోసం సూర్య వర్క్ షాప్ లో కూడా జాయిన్ అయ్యడని సమాచారం. అంతే కాదు భారీ స్థాయిలో ఈసినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్  చేసే ఆలోచనలో ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios