హీరో సూర్య కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా పరీక్ష చేయించుకోగా, నెగటివ్‌ వచ్చింది. ఇటీవల తాను కరోనాకి గురైనట్టు హీరో సూర్య వెల్లడించిన విషయం తెలిసిందే.

హీరో సూర్య కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా పరీక్ష చేయించుకోగా, నెగటివ్‌ వచ్చింది. ఇటీవల తాను కరోనాకి గురైనట్టు హీరో సూర్య వెల్లడించిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కోవిడ్‌ టెస్ట్ చేయించుకోగా నెగటివ్‌ వచ్చిందని సూర్య సన్నిహితుడు రాజశేఖర్‌ పాండియన్‌ తెలిపారు. 

Scroll to load tweet…

`సూర్య అన్నకు నెగటివ్‌ వచ్చింది. అందరి ప్రేమకు, ప్రార్థనలకు ధన్యవాదాలు. ఈ నెలాఖరు నుంచి సూర్య సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పారు. ప్రస్తుతం సూర్య.. పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు. ఇటీవల సినిమా ప్రారంభమైంది. ఇటీవల సూర్య `ఆకాశమే నీ హద్దురా` చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇందులోని డిలీటెడ్‌ సీన్స్ ని ఇటీవల విడుదల చేయగా, వాటికి మంచి స్పందన లభిస్తుంది.