Asianet News TeluguAsianet News Telugu

హీరో సూర్య అవుటాఫ్ షేప్, గుర్తుపట్టలేని విధంగా లుక్.. ఏం చేస్తున్నావ్ శివ ?

హీరో సూర్యకి తెలుగు తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా ఈ క్రేజీ హీరోకి అభిమానులు ఉన్నారు. సూర్య నటించే చిత్రాలు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి.

Hero Suriya Looks shocking look goes viral dtr
Author
First Published May 11, 2023, 4:48 PM IST | Last Updated May 11, 2023, 4:48 PM IST

హీరో సూర్యకి తెలుగు తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా ఈ క్రేజీ హీరోకి అభిమానులు ఉన్నారు. సూర్య నటించే చిత్రాలు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో హై బడ్జెట్ చిత్రం కంగువలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఆ మధ్యన రిలీజ్ అయిన గ్లింప్స్ తో సినిమాపై హైప్ పెరిగిపోయింది. జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలిని మించే చిత్రం తెరకెక్కిస్తున్నాం అని ఆయన పదే పదే చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే భారీగా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. సూర్య గెటప్ ఆసక్తిని రేపుతోంది.  

అయితే ఈ చిత్రం కోసం సూర్య ప్రాణం పెట్టేస్తున్నాడు. ఎలాంటి చిత్రం సూర్య ఒకసారి కమిటైతే తన 100 శాతం బెస్ట్ ఇచ్చేస్తాడు అనే పేరు ఉంది. ఈ చిత్రంలో సూర్య వివిధ గెటప్ లలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కంగువ దర్శకుడు శివతో సూర్య ఉన్న లేటెస్ట్ పిక్ వైరల్ గా మారింది. 

ఈ పిక్ లో సూర్య గుర్తుపట్టలేని విధంగా బొద్దుగా మారి కనిపిస్తున్నాడు. సూర్యని ఇంతకీ ముందెప్పుడూ ఫ్యాన్స్ ఇంత బొద్దుగా చూడలేదు. సూర్య ఎక్కడికి వెళ్లినా ఫిట్ గా కనిపించేవాడు. కానీ లేటెస్ట్ లుక్ చూస్తుంటే సూర్య అవుటాఫ్ షేప్ లో ఉన్నట్లు అర్థం అవుతోంది. అసలు శివ సూర్యతో ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కంగారు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కంగువ ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios