ఇటీవల `మోసగాళ్లు` చిత్రంతో తెలుగులో మెరిసిన బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి అపార్ట్ మెంట్‌ సీజ్‌కి గురయ్యింది. ముంబయి మున్సిపల్‌ అధికారులు సీజ్‌ చేశారు. 

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి అపార్ట్ మెంట్‌ సీజ్‌కి గురయ్యింది. ముంబయి మున్సిపల్‌ (బీఎంసీ) అధికారులు సీజ్‌ చేశారు. కరోనా నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ముంబయి, మౌంట్‌ రోడ్‌లోని పృథ్వీ అపార్ట్ మెంట్స్ లోని 18వ ఫ్లోర్‌లో సునీల్‌ శెట్టి నివసిస్తున్నారు. అక్కడ కరోనా కేసులు పెరగడంతో ఆ అపార్ట్ మెంట్‌ మొత్తాన్ని సీజ్‌ చేసినట్టు బీఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రశాంత్‌ గైక్వాడ్‌ వెల్లడించారు. 

`కేసుల విస్తరణను అడ్డుకునే క్రమంలో ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, భవనం మొత్తం మోహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే సునీల్‌ శెట్టి, ఆయన కుటుంబం మొత్తం ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. కొన్ని రోజులు ఈ నిర్భందం తప్పదని వెల్లడించారు. ఇక సునీల్‌ శెట్టి హీరోగానే కాదు కీలక పాత్రల్లోనూ మెరుస్తున్నారు. ఇటీవల ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `మోసగాళ్లు` చిత్రంలో నటించారు. ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న `గని` సినిమాలో నటిస్తున్నారు.