Asianet News TeluguAsianet News Telugu

మరోసారి హీరోగా సునిల్, ఈసారి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడట

మరోసారి హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాట సునిల్. కమెడియన్ గా స్టార్ డమ్, హీరోగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసి.. ఇప్పుడు అసలే సైలెంట్ గా ఉన్న సునిల్. ఎఫ్3 లో ఫుల్ లెన్త్ కామెడీరోల్ తో అలరించబోతున్నాడు. 
 

Hero Sunil New Movie Update
Author
Hyderabad, First Published May 21, 2022, 2:35 PM IST

క‌మెడియ‌న్‌గా ఫిల్మ్ కెరీర్  స్టార్ట్ చేసి.. కామెడీ లో స్టార్ డమ్ ను సంపాదించిన సునిల్... ఆతరరవాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..హీరోగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరిశాడు సునిల్. కాని హీరోగా కలిసిరాక.. అవకాశాలు లేక చాలా కాలం తెరపై పెద్దగా కనిపించలేదు సునిల్. చిన్నగా మళ్లీ క్కారెక్టర్ రోల్స్ చేసుకుంటున్నాడు.  క‌ల‌ర్ ఫొటో, పుష్ప సినిమాల‌తో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లోనూ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. ఇపుడు మ‌ళ్లీ ఎఫ్ 3  సినిమాతో త‌న‌లోని కామెడీ యాంగిల్‌ను ఆడియెన్స్ కు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. 

అయితే సునిల్  ఇక మళ్ళీ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసినట్టేనా.. లేక మళ్ళీ హీరోగా చేసే ఇంట్రెస్ట్ ఉందా అని అంతటా చర్చ నడుస్తుంది. గతంలో అందాల రాముడు ,మ‌ర్యాద రామ‌న్న  సినిమాల స‌క్సెస్ త‌ర్వాత హీరోగా చేసిన సినిమాలు  వ‌ర్క‌వుట్ కాలేదు. ఇపుడు ఎఫ్ 3 సినిమాతో మ‌ళ్లీ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో క‌నిపించేందుకు రెడీ అయ్యాడు. లీడ్ రోల్స్ లో సినిమాలు చేయ‌డంపై ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టు గ‌తంలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. 

అయితే షాకింగ్ న్యూస్ ఏంటీ అంటే.. హీరోగా సునిల్ ఇంకా ఆశలువదులుకోలేదట.  రీసెంట్‌గా చెప్పిన మాట‌ల‌తో అలాంటిదేమి లేద‌ని తేలిపోయింది. త్వ‌ర‌లోనే ఓ పెద్ద ప్లాన్‌తో ముందుకు రానున్న‌ట్టు చెప్పిన సునీల్‌..మ‌ళ్లీ హీరోగా న‌టించాల‌నుకుంటున్న‌ట్టు చెప్పాడు. ఈ సారి కాస్త బడ్జెట్ పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టు  తెలిపాడు సునీల్. 

దాదాపు పదేళ్ళకు పైగా క‌మెడియ‌న్‌గా అల‌రించి, క్యారెక్ట‌ర్ ఓరియెంటెడ్ రోల్స్ లో న‌టిస్తూ మెప్పిస్తున్న సునీల్‌..మ‌ళ్లీ త‌న‌లోకి హీరోను బ‌య‌ట‌కు తీయ‌బోతున్నాడ‌న్న అప్ డేట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మ‌రి ఇంత‌కీ హీరోగా రీఎంట్రీ ఇచ్చేందుకు ఎంత పెద్ద ప్లాన్ వేసుకుంటున్నాడో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios