హీరో సందీప్‌ కిషన్‌ హోటల్‌లో తనిఖీలు.. షాకిచ్చే విషయాలు బహిర్గతం..

సందీప్‌ కిషన్‌ హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్నారు. మరోవైపు హోటల్‌ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఫుడ్‌సెఫ్టీ అధికారులు షాకిచ్చారు.
 

hero Sundeep Kishan owned Restaurant inspection yielding expired food items arj

తెలుగు నటుడు సందీప్‌ కిషన్‌ హీరోగా నటించడంతోపాటు హోటల్‌ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన `వివాహ భోజనం` పేరుతో హోటల్స్ ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఆయనకు బ్రాంచీలున్నాయి. ఈ క్రమంలో తాజాగా సికింద్రాబాద్‌ లోని హోటల్‌లో ఫుడ్‌ సెఫ్టీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో షాకిచ్చే విషయాలు బయటపడ్డాయి. నాసిరకం, క్వాలిటీ లేని ఆహార పదార్థాలు ఉపయోగిస్తున్నట్టు ఫుడ్‌ సెఫ్టీ అధికారులు గుర్తించారు. 

కాలం చెల్లిన బియ్యాన్ని వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాలు తయారీ చేస్తున్నట్టు గుర్తించారు. వండిన ఆహార పదార్థాలు నిలువ చేసి ఫ్రిజ్ లో పెడుతున్న తీరు గుర్తింపు. ఫ్రిజ్‌ లో నిల్వ చేసిన పదార్థాలను వేడి చేసి కస్టమర్లకి అందిస్తున్నట్టు గుర్తించారు. ఫుడ్‌ ప్రిపరేషన్‌ కోసం వాడుతున్న నీరు కలుషితంగా ఉన్నట్టు గుర్తించారట. 

పాక్షికంగా తయారు చేసిన ఆహారాలు కవర్‌ చేయబడ్డాయి, కానీ సరైన లేబులింగ్‌ లేదని, కొన్ని డస్ట్ బిన్లు మూతలు లేవని గుర్తించారు. ఫుడ్‌ హ్యాండర్లకి మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు అందుబాటులో లేవు. వంటగదిలో కాలువలలో నీరు నిలిచిపోయింది. ఫుడ్‌ తయారీలో వాడే నీటి విశ్లేషణ నివేదిక లేదు. ఆహార నిర్వహణదారులు హెయర్‌నెట్‌లు, యూనిఫాంలు ధరించి ఉన్నట్టు గుర్తించారు. ఫుడ్‌ సెక్యూరిటీ లైసెన్స్ ని గుర్తించారు. కానీ కొన్ని లోపాలను గుర్తించారు. వాటిని సరిచేసుకోవాలని హెచ్చరించడం జరిగింది. సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవాలని తెలిపారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. 

సందీప్‌ కిషన్‌ కి సంబంధించిన హోటల్‌ లోని కొన్ని ఫోటోలు, తప్పుడు సమాచారం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హోటల్‌ నిర్వహకులు స్పందించారు. ఆ ఫోటోలు తమ కిచెన్‌లోనివి కావని స్పష్టం చేశారు. బియ్యానికి సంబంధించిన లోపాన్ని అధికారులు గుర్తించారని, దాన్ని ముందే తాము పక్కన పెట్టినట్టు తెలిపారు. వాటర్‌ నిల్వకి సంబంధించి వాళ్లు తనిఖీలు చేసే సమయం లంచ్‌ టైమ్‌ అని, అప్పుడు వాటర్‌ ఫ్లో ఉండటం వల్ల అలా ఉందని, తమ సిబ్బంది వెంటవెంటనే క్లీన్‌ చేస్తుందని, నాణ్యమైన ఫుడ్‌ అందించడమే తమ లక్ష్యం అని సందీప్‌ కిషన్‌ వెల్లడించారు.

సందీప్‌ కిషన్‌ సోలో హీరోగా సక్సెస్‌ కాలేకపోతున్నారు. ప్రారంభంలో ఆయన మంచి విజయాలు అందుకున్నారు. కానీ ఇటీవల సరైన హిట్లు పడటం లేదు. తెలుగు, తమిళంలో చేసినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆయన ధనుష్‌తో `రాయన్‌` చిత్రంలో నటిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios