Asianet News TeluguAsianet News Telugu

Sumanth : ‘మహేంద్రగిరి వారాహి’.. హీరో సుమంత్ కొత్త సినిమా టైటిల్.. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్!

హీరో సుమంత్ ప్రధాన పాత్రలో కొత్త సినిమా ప్రారంభమైంది. విశాఖ శారదాపీఠాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలతో మెదలు పెట్టారు. సినిమా టైటిల్, కథాంశం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 
 

Hero Sumanth new movie titled as Mahendragiri Vaarahi NSK
Author
First Published Nov 15, 2023, 6:45 PM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో సుమంత్ (Sumanth)  ప్రస్తుతం వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. గతేడాది వచ్చిన ‘మళ్లి మొదలైంది’ మూవీతో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ‘సీతారామం’, ‘సార్’ వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రలతో అలరించారు. ప్రస్తుతం ‘అనగనగ ఒక రౌడీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తైంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక నెక్ట్స్ సినిమాను కూడా ప్రారంభించారు. 

సుమంత్ ప్రధాన పాత్రలో మరో కొత్త సినిమా ఈ రోజు ప్రారంభమైంది.  
రాజశ్యామల బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెంబరు - 2గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పేరు కూడా ఖరారైంది. రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సమక్షంలో ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Vaarahi) అనే పేరుతో సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం మంగళవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించింది. హీరో సుమంత్‌, హీరోయిన్‌ మీనాక్షి, చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్‌, నిర్మాతలు కాలిపు మధు, ఎం సుబ్బారెడ్డి తదితరులు రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పూజలు చేసి, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసారు. 

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు. రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఆలయం విశాఖ శారదాపీఠంలోనే ఉన్నందున అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడకు వచ్చామని అన్నారు. ఈ ఏడాది జూన్‌ నెలలో షూటింగ్‌ ప్రారంభమైందని, త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. మహేంద్రగిరి వారాహి చిత్ర ఇతివృత్తాన్ని స్వరూపానందేంద్ర స్వామికి వివరించి ఆశీస్సులు అందుకున్నామని అన్నారు. 

రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ కింద చిత్రీకరిస్తున్న సినిమాల్లో మహేంద్రగిరి వారాహి రెండవ చిత్రమని నిర్మాత కాలిపు మధు, ఎం సుబ్బారెడ్డి తెలిపారు. రాజశ్యామలని నిత్యం ఉపాసించే తాను అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసం ఇక్కడకు రావడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. చిత్రం విజయవంతమైన అనంతరం మళ్ళీ విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శిస్తామని పేర్కొన్నారు. చిత్ర బృందాన్ని పీఠాధిపతులు శాలువాతో సత్కరించారు.

Hero Sumanth new movie titled as Mahendragiri Vaarahi NSK

Follow Us:
Download App:
  • android
  • ios