ఓ వెడ్డింగ్‌ కార్డ్ సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యింది. రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. ఇప్పటికే ఓ పెళ్లి చేసుకున్నావ్‌ ఇంకా బుద్ది రాలేదా అంటూ సెటైర్లు వేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా సుమంత్‌ స్పందించారు. 

హీరో సుమంత్‌ రెండో పెళ్ళి చేసుకోబోతున్నాడనే వార్త బుధవారం సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. ఆయన పవిత్ర అనే బంధువుల అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారనే టాక్‌ వినిపించింది. పెద్దల ఒత్తిడి మేరకు సుమంత్‌ సెకండ్‌ మ్యారేజ్‌కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, వచ్చే నెలలో వీరి వివాహం ఉండబోతుందని, ఓ వెడ్డింగ్‌ కార్డ్ సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యాయి. దీనిపై రామ్‌గోపాల్‌ వర్మ కూడాస్పందించారు. ఇప్పటికే ఓ పెళ్లి చేసుకున్నావ్‌ ఇంకా బుద్ది రాలేదా అంటూ సెటైర్లు వేశాడు. 

ఈ నేపథ్యంలో తాజాగా సుమంత్‌ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. తాను రెండో పెళ్ళి చేసుకోవడం లేదని స్పష్టం చేశాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వెడ్డింగ్‌ కార్డ్ తన నెక్ట్స్ సినిమాకి సంబంధించినదని వెల్లడించాడు. రియల్‌ లైఫ్‌లో తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని, వైరల్‌ అయిన వెడ్డింగ్‌ కార్డ్ తన తదుపరి సినిమాకి సంబంధించినది తెలిపాడు. పెళ్లి, విడాకులకు సంబంధించిన ఓ సినిమా చేస్తున్నానని, ఆ ఫిల్మ్ షూట్‌ నుంచి ఒక కార్డ్ ఫోటో లీక్‌ అయ్యిందని తెలిపారు. సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్‌ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పాడు. ఈ సందర్భంగా తన సినిమాకి సంబంధించి ఇంతటి ప్రమోషన్‌ రావడంతో అందరికి ధన్యవాదాలు తెలిపారు సుమంత్‌. ప్రస్తుతం ఆయన `అనగనగా ఒక రౌడీ` చిత్రంలో నటిస్తున్నారు.

Scroll to load tweet…