Asianet News TeluguAsianet News Telugu

ఇంట్రెస్టింగ్ గా సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ టీజర్.. చూశారా?

సుహాస్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’. ఈ చిత్రం నుంచి ఆసక్తికరమైన టీజర్ విడుదలైంది. సహజత్వంతో కూడిన సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 
 

Hero Suhas Ambajipeta Marriage Band movie Teaser Out now NSK
Author
First Published Oct 9, 2023, 8:05 PM IST | Last Updated Oct 9, 2023, 8:05 PM IST

యంగ్ హీరో సుహాస్ (Suhas) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి హిట్ చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్  తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రమే  ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ Ambajipeta marriage band.  టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. 

ఈ చిత్రాన్నిజీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా సుహాస్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఆయన బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు అలాగే టీజర్ ను కూడా త్వరలో విడుదల చేస్తామని అనౌన్స్  చేశారు. ఈమేరకు ఇవ్వాళ టీజర్ ను విడుదల చేశారు. 

టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లవ్, ఎమోషన్, డ్రామాతో ఆకట్టుకుంటోంది. చాలా సహజత్వంగా, సరికొత్త కంటెంట్ తో వస్తున్నట్టుగా తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖామని అర్థమవుతోంది. శేఖర్ చంద్ర అందించిన బీజీఎం చాలా బాగుంది. ఇక హీరోయిన్ శివానీ టీజర్ కు అందం తెచ్చింది.

ఈ చిత్రం కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్నది. మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. త్వరలో మరిన్ని అప్డేట్స్ తో రానున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios