యంగ్ హీరో శ్రీవిష్ణు అనారోగ్యం బారినపడ్డట్లు సమాచారం అందుతుంది. ఆయనకు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

హీరో శ్రీవిష్ణు(Srivishnu) తీవ్ర అనారోగ్యం బారినపడ్డారు. కొన్నాళ్లుగా ఆయన డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుంటున్న శ్రీవిష్ణు ప్లేట్ లెట్స్ బాగా పడిపోయాయట. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో శ్రీవిష్ణుకు చికిత్స అందిస్తున్నారు. ఇక శ్రీవిష్ణు అనారోగ్యానికి గురయ్యాడని తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవిష్ణు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ భళా తందాన ఇటీవల విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన భళా తందాన అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఇక అభిరుచి గల హీరోగా శ్రీవిష్ణు పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు, బ్రోచేవారెవరురా, రాజా రాజా చోర వంటి హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. హీరోగా పరిశ్రమలో శ్రీవిష్ణుకు మంచి పేరుంది. 

ప్రస్తుతం శ్రీవిష్ణు అల్లూరి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయన పవర్ ఫుల్ పోలీస్ పాత్ర చేస్తున్నారు. అల్లూరి సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ కాగా, ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు. ఇక శ్రీవిష్ణు కోలుకున్న వెంటనే షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.