రీసెంట్ గా అఖండ సినిమాతో విలన్ గా మారిపోయాడు ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ (Srikanth). ఇండస్ట్రీ పెద్ద విషయంలో ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రీసెంట్ గా అఖండ సినిమాతో విలన్ గా మారిపోయాడు ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ (Srikanth). ఇండస్ట్రీ పెద్ద విషయంలో ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఇష్యూస్ తో  టికెట్ల రేట్ల అంశంతో పాటు ఇండస్ట్రీ పెద్ద ఎవరనేది కూడా ఉంది. ఆ మధ్య మా ఎలక్షన్స్ టైమ్ లో ఈ విషయంలో రచ్చ రచ్చ జరిగిన విషయం తెలిసిందే. తర్వాత ఈ వ్యవహరం కాస్తా సద్దుమనిగింది. మా ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలు.. మోహన్ బాబు, చిరంజీవి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందన్న ప్రచారం.. ఇండస్ట్రీలో జరిగిన డిస్ట్రబెన్స్ ల వల్ల మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని, కానీ పరిశ్రమలోని కార్మికులకు, వ్యక్తులకు అవసరమైన సమయంలో తాను ముందుంటానని అన్నారు. అన్నట్టుగానే.. సీఎం జగన్ తో వరుస సమావేశాలతో.. ఇండస్ట్రీ సమస్యలు కొలిక్కి వచ్చేలా చేసి..ఇండస్ట్రీకి తాను అండగా ఉన్నాను అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.

ఇక ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఫ్యామిలీ హీరో శ్రీకాంత్(Srikanth) ఇండస్ట్రీ పెద్ద అంశంపై  చేసిన కామెంట్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ​లో పరిశ్రమ పెద్ద అంశంపై కూడా స్పందించారు. ఈ మేరకు శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. తన వరకు ఇండస్ట్రీ పెద్ద మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)గారు అన్నారు. ఎందుకుంటే ‘చాలా కాలంగా చిరంజీవి ఎంతో మందికి సాయం చేస్తూ వస్తున్నారు. పరిశ్రమలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుగా కలిసేది చిరంజీవినే అన్నారు శ్రీకాంత్

ఏ సమస్య వచ్చినా.. ఎవరైనా.. ఆయనను కలిసి తమ సమస్యలు పరిష్కారించాలని కోరతారు. అలాగే చిరంజీవి(Chiranjeevi)గారు  కూడా వెంటనే స్పందించి వారి సమస్యలకు పరిష్కారం అందిస్తారు.  దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద అనడంలో తప్పులేదు అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు శ్రీకాంత్‌. అంతేగాక టికెటు రెట్ల అంశంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుగా ఆహ్వానించింది చిరంజీవి గారినే.. దీన్ని బట్టి పరిశ్రమలో ఆయన స్థానం ఏంటన్నది అర్థమవుతోంది అన్నారు.

అయితే మా ఎన్నికల్లో శ్రీకాంత్‌(Srikanth) ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే గెలిచిన ప్రకాశ్‌ ప్యానల్‌ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఫ్యామిలీ హీరోగా పేరు సంపాధించిన శ్రీకాంత్ మళ్లీ విలన్ పాత్రల వైపు మళ్లారు. రీసెంట్ గా శ్రీకాంత్(Srikanth)  నటించిన అఖండ మూవీ  సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో విలన్ గా కొత్తగా కనిపించిన శ్రీకాంత్ .. తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.