బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు సభ్యులు ఉన్నారు. గత వారం అవినాష్ ఎలిమినేట్ కాగా...అభిజిత్, అరియనా, అఖిల్, సోహైల్, మోనాల్ మరియు హారిక కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్నారు. అఖిల్ ఇప్పటికే నేరుగా ఫైనల్ కి చేరుకోవడం జరిగింది. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ ఫైనల్ కి చేరిన కారణంగా అతను ఈ వారం ఎలిమినేషన్స్ నుండి మినహాయింపు పొందారు. ఇక మిగిలిన ఐదుగురిని బిగ్ బాస్ నేరుగా ఎలిమినేషన్ కి నామినేట్ చేశాడు.  
 
ఈ ఐదుగురు సభ్యుల నుండి ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. మిగిలిన నలుగురు అఖిల్ తో  పాటు ఫైనల్ కి చేరుకోవడం జరుగుతుంది. హీరో శ్రీకాంత్ ఈ సీజన్ విన్నర్ ఎవరనే విషయంపై స్పందించడం జరిగింది. ఈ సీజన్ మొదటి నుండి ఫాలో అవుతున్నానన్న శ్రీకాంత్, అభిజిత్ విన్నర్ కావచ్చని చెప్పాడు. 
 
తన అభిప్రాయంలో సభ్యుల ఆటతీరును బట్టి చూస్తే అభిజిత్ స్ట్రాంగ్ అని, అతడే విన్నర్ అవుతాడని అంచనా వేస్తున్నాను అన్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న అందరికంటే అభిజీత్ భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా అభిజిత్ విన్నర్ అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఏదిఏమైనా మరో రెండు వారాలలో విన్నర్ ఎవరో తేలిపోనుంది.