సోషల్ మీడియాలో అన్నీ దిగజారుడు రాతలే..!

First Published 9, Mar 2018, 7:40 PM IST
hero srikanth fires social media gossip mongers
Highlights
  • సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై హీరో శ్రీకాంత్ ఫైర్
  • లేనిపోని వదంతులు సృష్టిస్తూ యూట్యూబ్ లో రెచ్చిపోతున్నారన్న శ్రీకాంత్
  • తనకు యాక్సిడెంట్ కాకున్నా అయ్యిందని కుటుంబ సభ్యులను టెన్షన్ పెట్టారన్న శ్రీకాంత్

హీరో శ్రీకాంత్ కు ఆగ్రహం వచ్చింది. లేనిపోని పుకార్లు సృష్టిస్తూ.. అసత్య వార్తలు రాసే యూట్యూబ్, వెబ్ సైట్స్ మీద మండిపడ్డాడు. శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో గాపడ్డాడంటూ యూట్యూబులోని కొన్ని చానెళ్లలో వార్తలు వచ్చాయి. దీనిపై శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘‘నేను బెంగళూరు షూటింగులో ఉన్న నాకు ఉదయం నుంచి ఒకటే ఫోన్లు. మీకు యాక్సిడెంట్ అయ్యిందట కదా, ఎలా ఉందని అంతా ఫోన్ చేస్తున్నారు. హైదరాబాదులో ఉన్న నా కుటుంబ సభ్యులు ఈ సమాచారం తెలిసి కంగారు పడ్డారు’’ అని తెలిపారు.‘‘యూట్యూబ్ ఛానల్ వాళ్ళు.. లైకులు, సబ్స్ క్రైబర్స్ కోసం ఇంతగా దిగజారుతారా? అసత్య ప్రచారాలతో వీడియోలు చేసి, ఇలాంటి వార్తలు పెట్టడం చాలా తప్పు. ఇలా తప్పుడు సమాచారాలను అందిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇకపై ఎవరూ ఇలాంటి అసత్య వార్తలు రాయొద్దు. ఎవరో ఓ చానెల్ చెప్పే కట్టు కథలు చూసి.. మిగతా వైబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, పత్రికల వారు అదే వార్త రాస్తున్నారు. అది వాస్తవమా కాదా అని కూడా ఆలోచించడం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ మేరకు అసత్య ప్రచారం చేస్తున్న సైట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ‘మా’ ఫిర్యాదు చేసింది’’ అని శ్రీకాంత్ తెలిపారు.

loader