హీరో శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి!
హీరో శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది.శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూతురు పెళ్లి పీటలు ఎక్కింది. ఈ పెళ్లి వేడుకలో శ్రీకాంత్ ఫ్యామిలీ పాల్గొన్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

శ్రీకాంత్ కి స్వయానా తమ్ముడైన అనిల్ మేక కూతురు వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాంత్ కుటుంబంతో పాటు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లి కూతురిని ఆశీర్వదించారు. శ్రీకాంత్ భార్య ఊహ, కొడుకు రోషన్, కూతురు మేద, చిన్న కుమారుడు రోహన్ పెళ్ళిలో సందడి చేశారు. శ్రీకాంత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల శ్రీకాంత్-ఊహా విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను శ్రీకాంత్ ఖండించారు. ఇక విలన్ గా మారిన శ్రీకాంత్ బిజీ అవుతున్నారు. ఇటీవల వారసుడు మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. శ్రీకాంత్ ఖాతాలో గేమ్ ఛేంజర్, దేవర చిత్రాలున్నాయి. వీటిలో కూడా ఆయన నెగిటివ్ రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. వృషభ టైటిల్ తో మోహన్ లాల్ హీరోగా పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. ఈ మూవీలో శ్రీకాంత్ తో పాటు కొడుకు రోషన్ కూడా నటిస్తున్నారు. వృషభ చిత్ర షూటింగ్ మొదలైంది.
ఇక శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 1999లో 'ప్రేమించేది ఎందుకమ్మా' టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేశారు. ఈ మూవీ అంతగా ఆడలేదు. దాంతో ఆయన హీరోగా ప్రయత్నాలు ఆపేశారు. నిర్మాతగా ఒకటి రెండు చిత్రాలు చేశారు. ఆయనకు పరిశ్రమ కలిసి రాలేదు.