సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రారంభం కాబోతోంది. గత కొన్ని సీజన్స్ దారుణంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీనితో ఈ సీజన్ ని నిర్వాహకులు డిఫెరెంట్ గా ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రారంభం కాబోతోంది. గత కొన్ని సీజన్స్ దారుణంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీనితో ఈ సీజన్ ని నిర్వాహకులు డిఫెరెంట్ గా ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్స్ లో కూడా నాగార్జున ఉల్టా పల్టా అంటూ సందడి చేస్తున్నారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ రూల్స్ మొత్తం మార్చేసి ఆడియన్స్ కి మంచి కిక్కిచ్చే వినోదం రెడీ చేస్తున్నారట. 

దీని కోసం కంటెస్టెంట్స్ ఎంపిక కూడా ఆ తరహాలోనే సాగినట్లు తెలుస్తోంది. ఆడియన్స్ లో పాపులారిటీ కలిగిన సెలెబ్రిటీలనే సీజన్ 7 కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ గురించి క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. బిగ్ బాస్ 7 లోకి హీరో శివాజీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శివాజీ టాలీవుడ్ లో పాపులర్ అయ్యారు. అయితే ఆయన చేసే కాంట్రవర్షియల్ కామెంట్స్ శివాజీకి సినిమాలకు మించే విధంగా పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. శివాజీ గతంలో వరుసగా పొలిటికల్ కామెంట్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. మీడియా కూడా శివాజీ కామెంట్స్ ని బాగా హైలైట్ చేసింది. 

దీనితో శివాజీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని భావించారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు శివాజీ బిగ్ బాస్ 7లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. శివాజీ ఎంట్రీకి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తయినట్లు సమాచారం. ఈసారి బిగ్ బాస్ 7 కోసం నిర్వాహకులు కాంట్రవర్షియల్ సెలెబ్రిటీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆల్రెడీ శృంగార తార షకీలా, కిరణ్ రాథోడ్ లో బిగ్ బాస్ 7 లోకి కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని సీజన్లు విమర్శల పాలు కావడంతో నిర్వాహకులు టీఆర్పీ రేటింగ్స్ కోసం ఈ ప్లాన్ వేశారు.