మనం ఎదుగుతూ ఇతరులు ఎదిగేలా చేయాలంటారు గొప్పవాళ్లు. తమిళ హీరో శివ కార్తికేయన్ అదే చేస్తున్నాడు. యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ కి వరుస అవకాశాలిచ్చి ఆమె కెరీర్ గాడినపెట్టాడు.  

కోలీవుడ్ లో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) రైజింగ్ స్టార్. వరుస హిట్స్ తో స్టార్స్ హీరోల లిస్ట్ చేరాడు. స్టాండప్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శివ కార్తికేయన్ ఈ రేంజ్ కి రావడం నిజంగా గ్రేట్. ఆయన గత చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన డాక్టర్ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక లేటెస్ట్ మూవీ డాన్ రికార్డు వసూళ్లు సాధిస్తుంది. డాన్ సైతం వంద కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 

ఈ రెండు చిత్రాలతో శివకార్తికేయన్ రేంజ్, మార్కెట్ మరో స్థాయికి చేరాయి. కాగా ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఇమేజ్ కి కూడా డాక్టర్, డాన్ చిత్రాలు ప్లస్ అయ్యాయి. శివ కార్తికేయన్ తో ప్రియాంక జతకట్టగా ఆమె లక్ కలిసొచ్చింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో శివ కార్తికేయన్ ప్రియాంకకు అవకాశం ఇవ్వడం జరిగింది. నటించిన రెండు చిత్రాలు భారీ హిట్స్ కొట్టడంతో హిట్ ఫెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో శివ కార్తికేయన్ ప్రియాంకకు మరిన్ని ఛాన్సెస్ ఇచ్చే అవకాశం కలదు. 

ఇక 2019లో ఓ కన్నడ చిత్రంతో ప్రియాంక కెరీర్ మొదలైంది. అదే ఏడాది తెలుగులో నాని హీరోగా విడుదలైన గ్యాంగ్ లీడర్ మూవీలో ఛాన్స్ కొట్టేశారు. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. ఇక శర్వానంద్ కి జంటగా శ్రీకారం చిత్రం చేశారు. ఇది ప్లాప్ కావడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కనుమరుగయ్యాయి. డాక్టర్ మూవీతో ఫస్ట్ హిట్ ఆమె ఖాతాలో వేసుకున్నారు. 

డాక్టర్ చిత్రం తర్వాత సూర్యతో ఛాన్స్ కొట్టారు. 2022 సంవత్సరం ప్రియాంకకు బాగా కలిసొచ్చింది. సూర్య 'ఈటి' కూడా హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. డాన్ (Don) ఆమె ఖాతాలో చేరిన మరో భారీ హిట్. ఈ విజయం తర్వాత ఆమెకు కోలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టే అవకాశం కలదు. ప్రియాంకకు చిరస్మరణీయమైన రెండు హిట్స్ ఇచ్చి, ఎదుగుదలకు శివ కార్తికేయన్ పునాది వేశాడు. ఓ వర్ధమాన హీరోయిన్ ఈ విజయాలు చాలా అవసరం. మరి చూడాలి భవిష్యత్ లో ప్రియాంక ఇలాంటి క్రేజీ ఆఫర్స్ పట్టేయనుందో..