Asianet News TeluguAsianet News Telugu

ప్రశ్నించినందుకు అప్పుడు నాపై దాడి జరగలేదు..ఇప్పుడు దేశం మారిందిః సిద్ధార్థ్‌

ఇటీవల కాలంలో హీరో సిద్ధార్థ్‌ బీజేపీకి వ్యతిరేకంగా తన వాయిస్‌ని వినిపిస్తున్నారు. మతతత్వానికి, హిందూ వాదానికి, సామాన్యులపై దాడులపై ఆయన స్పందిస్తున్నారు. సమాజంలో వస్తోన్న మార్పులపై ఆయన మాట్లాడుతున్నారు. తాజాగా సిద్ధార్థ్‌ 2009నాటి ఓ వీడియోని పంచుకున్నారు.

hero siddharth said that country has changed  arj
Author
Hyderabad, First Published Feb 17, 2021, 4:15 PM IST | Last Updated Feb 17, 2021, 4:15 PM IST

`2009లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో మాట్లాడినప్పుడు, నా అభిప్రాయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. నాపై దాడి జరగలేదు. కానీ ఇప్పుడు ఇండియా మారిపోయింది` అని అంటున్నారు హీరో సిద్ధార్థ్‌. `బొమ్మరిల్లు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన సిద్దార్థ్‌` ఇప్పుడు తమిళంలో హీరోగా రాణిస్తున్నారు. ఆ టైమ్‌లో ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందనేది తెలిపారు.

ఇటీవల కాలంలో ఆయన బీజేపీకి వ్యతిరేకంగా తన వాయిస్‌ని వినిపిస్తున్నారు. మతతత్వానికి, హిందూ వాదానికి, సామాన్యులపై దాడులపై ఆయన స్పందిస్తున్నారు. సమాజంలో వస్తోన్న మార్పులపై ఆయన మాట్లాడుతున్నారు. తాజాగా సిద్ధార్థ్‌ 2009నాటి ఓ వీడియోని పంచుకున్నారు. ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేస్తూ, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ యూనివర్సిటీలో తాను మాట్లాడినప్పుడు తన అభిప్రాయాన్ని పంచుకున్నప్పుడు ఎవరూ దాడి చేయలేదన్నారు. దేశం మారిపోయిందన్నారు.

సమాజంలో, రాజకీయాల్లో వస్తోన్న మార్పులను ఆయన ఎత్తిచూపారు. ఇటీవల పర్యావరణ కార్యకర్త దిశారవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా సిద్దార్థ్‌ తరచూ ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొత్తగా వచ్చిన నార్మల్‌ ఎవిల్‌ వల్ల మన బ్రెయిన్‌ వాష్‌ అవుతుందన్నారు. నా ప్రసంగంపై అప్పుడు ఎలాంటి బెదిరింపులు రాలేదని స్పష్టం చేశారు. అప్పుడు అలా ఎందుకు ఉందనేది తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇప్పుడు దేశం మారిపోయింది. అది మన కళ్ల ముందు కనిపిస్తుంది. దాని గురించి మనం ఏం చేయబోతున్నామనేది మన ముందున్న ప్రశ్న అని చెప్పారు.

ఏపీలో వరదలు వస్తే సహాయం చేయడానికి ముందుకొస్తే అప్పటి ఏపీ సీఎం తన మాటవినలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం ఏదైనా చేయాలనుకునే ప్రముఖుడినే ఏం చేయనీవ్వకపోతే, సామాన్యుడు ఏం చేస్తాడు` అని సిద్ధార్థ్‌ ఆ సమయంలో ప్రశ్నించారు. మరోవైపు 26 /11 ఉగ్రదాడుల సమయంలో మీడియాపై విమర్శలు గుప్పించారు. చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్‌ తెలుగులో `మహాసముద్రం`లో శర్వానంద్‌తో కలిసి నటిస్తున్నారు. మరోవైపు తమిళంలో `టక్కర్‌`, `ఇండియన్‌ 2`, `నవరస` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios