Asianet News TeluguAsianet News Telugu

తప్పు జరిగితే ఊరుకోను.. `మా` ఎన్నికలపై సిద్ధార్థ్‌ హాట్‌ కామెంట్‌..

`మా` ఎన్నికలపై హీరో సిద్ధార్థ్‌ స్పందించారు. `మా`లో తనకు ఓటు ఉందని, కచ్చితంగా తాను ఓటు వేస్తానని తెలిపారు. తనకు నచ్చిన వారికే ఓటు వేస్తానన్నారు. ప్రస్తుతం `మా`లో జరుగుతున్న పరిణామాలన్నింటిని గమనిస్తున్నానని తెలిపారు. 

hero siddharth intresting comments on maa elections and mahasamudram movie
Author
Hyderabad, First Published Oct 8, 2021, 8:24 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హీరో సిద్ధార్థ్‌ ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ఆయన నటించిన `మహాసముద్రం` విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు సమంత, చైతూ విడాకులకు సంబంధించి ఆయన పరోక్షంగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌ అవుతుంది. ఈ రెండింటి గురించి జరిగే చర్చలో సిద్ధార్థ్‌ సెంటర్‌ పాయింట్‌గా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన `మా` ఎన్నికలపై స్పందించారు. ఈ నెల 10న `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికలు జరగబోతున్నాయి. తాజాగా `మహాసముద్రం` ప్రమోషన్‌లో ఆయన మాట్లాడారు. 

`మా` ఎన్నికలపై  siddharth స్పందించారు. maa electionలో తనకు ఓటు ఉందని, కచ్చితంగా తాను ఓటు వేస్తానని తెలిపారు. తనకు నచ్చిన వారికే ఓటు వేస్తానన్నారు. ప్రస్తుతం `మా`లో జరుగుతున్న పరిణామాలన్నింటిని గమనిస్తున్నానని తెలిపారు. అందరి మాట విని, నా మనసులో ఏమనిపిస్తే వారికే ఓటు వేస్తాను అని తెలిపారు. అయితే తాను `మా`లో సభ్యుడిని కాబట్టి, తప్పు జరిగితే నిర్మోహమాటంగా ప్రశ్నిస్తానని తెలిపారు. తనకు కోపం ఎక్కువ అని, ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా అని తెలిపారు. 

తాను నిజాయితీగా ఉంటానని, అందరు అలానే ఉండాలని కోరుకుంటానన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధమే అన్నారు. రాజకీయాలపై స్పందిస్తూ, పాలిటిక్స్ లోకి రాను అని చెప్పలేను, కానీ వచ్చే అవకాశాలు తక్కువ అన్నారు. `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికలకు మరోరెండు రోజులే ఉంది. `మా` అధ్యక్ష పీఠం కోసం మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్‌ పోటీపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అత్యంత వివాదాస్పదంగా మారాయి. లోకల్‌, నాన్‌లోకల్‌ అనే దాన్ని హైలైట్‌ చేస్తూ ఎన్నికలకు తెరలేపారు. మరి ఇందులో గెలుపెవరిది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

also read: కుక్కల గురించి ట్వీట్ చేశా... సమంత గురించి కాదు, బాధపడితే నేనేం చేయలేను: సిద్ధార్థ్ వ్యాఖ్యలు

మరోవైపు సిద్ధార్థ్‌ ఇంకా మాట్లాడుతూ, తాను నటించిన maha samudram movie గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సిద్దార్థ్‌, sharwanand హీరోలుగా, అను ఇమ్మాన్యుయెల్‌, అదితిరావు హైదరీ హీరోయిన్లుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ నెల 14న దసరా కానుకగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ చెబుతూ, తనకిది మంచి కమ్ బ్యాక్‌ చిత్రమవుతుందన్నారు. `2003లో బాయ్స్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా మారలేదు. అప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. మధ్యలో వచ్చింది బ్రేక్‌లాంటిది కాదు. కానీ నాలో నేను వెతుక్కునే క్రమంలో బ్రేక్ వచ్చింది. 

అందరూ కాశీ, హిమాలయాలకు వెళ్తుంటారు. అలా నేను కూడా కాస్త గ్యాప్ ఇచ్చాను. నాకు నేను మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నన్ను స్టార్‌ను చేసింది తెలుగు వాళ్లే. అయితే ప్రతీ భాషల్లో నాకు ఓ ఐకానిక్ చిత్రం ఉంది. తమిళంలో` బాయ్స్`, హిందీలో `రంగ్ దే బసంతి` ఇలా ఉన్నాయి. అయితే నేను ప్రతీ చోటా తెలుగు నటుడిని అని చెప్పుకునేవాడిని. దాంతో అక్కడి వారు హర్ట్ అయ్యేవారు. కానీ నేను తెలుగు స్టార్‌ని, ఇండియన్ నటుడిని. అందుకే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాను. ఇకపై తెలుగు ప్రేక్షకులను వదిలిపెట్టి వెళ్లను` అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios