Asianet News TeluguAsianet News Telugu

కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ `టక్కర్‌`తో సాహసం చేస్తున్న సిద్దార్థ్‌.. వర్కౌట్‌ అవుతుందా?

హీరో సిద్ధార్థ్‌ అంటే లవ్‌ స్టోరీ చిత్రాలే గుర్తొస్తాయి. చాలా వరకు ఆయన లవ్‌ స్టోరీ సినిమాలు చేశారు. అయితే దాన్నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం `టక్కర్‌`తో ఓ ప్రయోగం చేశారు.

hero siddharth first time experiment with takkar movie arj
Author
First Published May 29, 2023, 11:12 PM IST

హీరో సిద్ధార్థ్‌ అంటే లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ గుర్తొస్తుంది. అనేక లవ్‌ స్టోరీస్‌ చేసి మెప్పించాడు సిద్ధార్థ్‌. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `బొమ్మరిల్లు`, `ఓయ్‌` ఇలా ఆయన చేసిన సినిమాలన్నీ లవ్‌ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్స్. అయితే ఆ ఇమేజ్‌ని నుంచి ఇరవై ఏళ్లు అవుతున్నా బయటపడలేకపోయారు. మధ్యలో ఆయన యాక్షన్‌ సైడ్‌ ట్రై చేసినా ప్రయోజనం లేదు. ఆ దిశగా సక్సెస్‌ కాలేకపోయాడు. దీంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో కమర్షియల్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాడట. తన కెరీర్‌లో మొదటిసారి `టక్కర్‌` సినిమాతో ప్రయోగం చేస్తున్నానని తెలిపారు సిద్ధార్థ్‌. 

`టక్కర్‌` కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా, యూత్‌ని ఆకట్టుకునేలా ఉంటుందట. యాక్షన్‌, కామెడీ మాత్రమే కాదని, రొమాంటిక్‌ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలిపారు సిద్ధార్థ్‌. తాజాగా ఆయన సోమవారం `టక్కర్‌` ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ `టక్కర్‌` ప్రత్యేకతలు వెల్లడించారు. తనని కమర్షియల్‌ హీరోగా, మాస్‌ హీరోగా, ఇప్పటి వరకు చూపించని విధంగా ఓ కొత్త స్టయిల్‌లో చూపించాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు కార్తిక్. జి క్రిష్‌ ఈ కథతో తన వద్దకు వచ్చాడట. ఈ కథ, అతని ఐడియా నచ్చి సినిమా చేసినట్టు చెప్పారు సిద్ధార్థ్‌. 

`పూర్తి కమర్షియల్ సినిమాగా కార్తీక్ జి. క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో నన్ను కార్తీక్ చాలా కొత్తగా చూపించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్ తో ఈ లవ్ స్టోరీ నడుస్తుంది. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసినట్టు అవుతుంది. ఇప్పటికీ నా చేతిలో ఓ అరడజను సినిమాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీయడం జరిగింది. ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్‌ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక యూనిక్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్ కి ఈ లవ్ స్టోరీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది, బోల్డ్ సీన్లు లేవని, రొమాంటిక్‌ సీన్లు ఉంటాయని, అవి శృతి మించి ఉండవన్నారు` అని తెలిపారు సిద్ధార్థ్‌. 

చిత్ర దర్శకుడు కార్తిక్ జి క్రిష్ మాట్లాడుతూ, నేను ఏ కంటెంట్ రాసిన ఈ సినిమా కంటెంట్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అని చాలామంది చెప్పారు. ఇప్పటివరకు సిద్దార్థ్ ను మీరు ఒక లవర్ బాయ్ గా చూసారు. సిద్దార్థ్ ఒక రగ్గడ్ లవర్ బాయ్ గా ఇందులో చూపించాను. ఈ సినిమా అన్ని సినిమాలలా  కాకుండా, కొంచెం కొత్తగా ఉండబోతుంది. ఇందులో లవ్ , కామెడీ, రొమాన్స్ అన్ని ఉంటాయి. ఇది న్యూ జనరేషన్ సినిమా అని చెప్పొచ్చు` అని వెల్లడించారు.

తెలుగులో ఈ సినిమాని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై విడుదల చేస్తున్నారు. పీపుల్స్ మీడియా నుంచి నిర్మాత వివేక్‌ కూచిబొట్ల మాట్లాడుతూ, ఈ సినిమా మంచి కంటెంట్ తో తెరకెక్కింది. సిద్దార్థ్ గారు మంచి పెరఫార్మర్, ఈ సినిమా సిద్దార్థ్ గారికి మళ్ళీ ఆ స్థాయి  హిట్ అవుతుంది. మళ్ళీ మన పాత సిద్దార్థ్ గారిని చూస్తాం. జూన్‌ 9న సినిమాని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నామని వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios