గెట్ రెడీ బాయ్స్.. రీరిలీజ్ కు రెడీ అవుతుంది యూత్ ఫుల్ ఎంటర్టైర్ మూవీ బొమ్మరిల్లు. సిద్దార్ధ్ నటించి ఈసినిమా యువతకు ప్రేమ పాఠాలు నేర్పింది. మరి ఈ ట్రెండ్ సెట్టర్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే...
ఈమధ్య రీరిలీజ్ ట్రెండ్ గట్టిగానడుస్తోంది. రీరిలీజ్ సినిమాలను సినిమా లవర్స్ బాగా ఎంకరేజ్ చేయడంతో.. అటు ఆడియన్స్ కు థ్రిల్ తో పాటు.. మేకర్స్ కు జేబుల్ కూడా ఫుల్ అవుతున్నాయి. దాంతో సినిమా వాళ్లు కూడా ఏ సినిమా రీరిలీజ్ చేస్తూ బాగా క్రేజ్ ఉంటుందో వెతికి మరీ ఆపనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు మూడేళ్లుగా ఇలా చాలా సినిమాలు రీరిలీజ్ ట్రెండ్ లోకి వెళ్లిపోయాయి. తాజాగా మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ రీరిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ‘ఓయ్’ సినిమాతో పాటు మరో 6 సినిమాలు రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఓయ్ సినిమా విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఓయ్ రీరిలీజ్ తర్వాత థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్ట్స్ దర్శనమిచ్చాయి. అంతలా ఈమూవీకి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే ‘బొమ్మరిల్లు’.
ఒకప్పుడు హీరో సిద్ధార్థ్ కు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. బాయ్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సిద్దు. పెద్దగా స్టార్ కాలేకపోయాడు తెలుగులో. కాని బొమ్మరిల్లు తరువాత అతని దశ తిరిగిపోయింది టాలీవుడ్ లో. ఆతరువాత వరుస ప్రేమ కథ సినిమాలో లవర్ బాయ్ గా మారిపోయాడు. నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, ఓయ్, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో ఓయ్, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా చిత్రాలు రీరిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు సూపర్ హిట్ బొమ్మరిల్లు మూవీ మళ్లీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈసినిమాన ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అప్పుడు ఆ నెలలో హీరో సిద్ధార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీని మళ్లీ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. భాస్కర్ దర్శకత్వం వహించగా.. ఈసినిమా నుంచి అతన్ని బొమ్మరిల్లు భాస్కర్ అని పిలవడం మొదలు పెట్టారు. అంతే కాదు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈషినిమాను నిర్మించారు. సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించారు. 2006లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
