కొన్ని విషయాలపై స్పందించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు సోషల్ మీడియా కామెంట్స్ పూర్తి స్పృహతో చేయాలి. లేదంటే హీరో సిద్ధార్థ మాదిరి అబాసుపాలు కావాల్సి వస్తుంది. తన తప్పు తెలుసుకున్న సిద్ధార్థ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కి బహిరంగ క్షమాపణలు చెప్పారు.
సైనా నెహ్వాల్ (Saina Nehwal) ట్వీట్ కి సమాధానంగా హీరో సిద్ధార్థ చేసిన ఓ కామెంట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సిద్ధార్థ తీరుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఈ విషయంపై సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. దేశ ప్రధాని విషయంలో ఇలా జరగడం దురదృష్టకరం. ప్రధానికే భద్రత లేకుంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి? ఈ పరిణామాన్ని ఖండిస్తున్నాను.. అంటూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ పై సిద్ధార్థ వ్యగ్యంగా స్పందించారు. ఓ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ ఛాంపియన్ అంటూ.. సైనాపై అవమానకర కామెంట్ చేశారు.
సిద్దార్థ (Siddharth) ట్వీట్ సైనా ఆటను, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా ఉంది. సిద్దార్థ ట్వీట్ పై సైనా నెహ్వల్ తో పాటు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమీషన్ సైతం రంగంలోకి దిగి సిద్ధార్థ మీద చర్యలు తీసుకోవాలని, అతని ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సిద్ధార్థ తీరును తప్పుబట్టడంతో పాటు సైనాకు మద్దతుగా నిలబడ్డారు.
సర్వత్ర తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిద్ధార్థ దిగొచ్చారు . ట్విట్టర్ వేదికగా సైనాకు క్షమాపణలు చెప్పారు. ఆయన ఓ లెటర్ విడుదల చేశారు. డియర్ సైనా... అది ఒక బ్యాడ్ జోక్. ట్వీట్ ద్వారా మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. అందరూ ఆపాదిస్తున్నట్లు మీ పట్ల నాకు ఎటువంటి చులకన భావన లేదు. నిన్ను అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఏది ఏమైనా మీ మనసును బాధపెట్టినందుకు నన్ను క్షమించు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేద్దాం... అంటూ తన లేఖలు పొందుపరిచారు.
స్త్రీగా సైనాను అవమానించాలనేది తన ట్వీట్ ఉద్దేశం కాదని. తన హాస్య ప్రయోగం తప్పుగా రీచ్ అయినట్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరోవైపు సిద్ధార్థ చర్యలు ఈ మధ్య తరచుగా వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లను ఉద్దేశిస్తూ ఆయన చేస్తున్న ఇలాంటి ట్వీట్స్ సిద్ధార్థ గౌరవాన్ని తగ్గించేలా ఉంటున్నాయి. అయితే సిధార్థ క్షమాపణలను నెటిజెన్స్ తప్పుబడుతున్నారు. చెత్త కామెంట్స్ చేసి సారీ చెబితే సరిపోతుందా... అంటూ ఫైర్ అవుతారు. ముఖ్యంగా మహిళలు సిద్ధార్థ పై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబర్ నెలలో సమంత (Samantha)భర్త నాగ చైతన్యతో విడాకులు ప్రకటించారు. కాగా సిద్ధార్థ సమంతపై మానసిక దాడి చేశారు. పరోక్షంగా ఆమెను ఉద్దేశిస్తూ... చీటర్స్ ఎప్పటికీ బాగుపడారంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సమంతను ఉద్దేశించే అని అందరికీ తెలుసు. విడాకుల కారణంగా మానసిక వేదిక అనుభవిస్తున్న ఒక అమ్మాయిపై సిద్ధార్థ చేసిన కామెంట్ విమర్శలపాలైంది. అయితే సిద్దార్థ ఇక్కడ పేరు మెన్షన్ చేయకపోవడంతో అది వివాదాస్పదం కాలేదు.
హీరోగా ఒకప్పుడు సౌత్ లో స్టార్ డమ్ అనుభవించాడు సిద్ధార్థ. తెలుగు, తమిళ భాషల్లో ఆయనకు మంచి మార్కెట్ ఉండేది. ప్రస్తుతం హీరోగా ఫేడ్ అవుట్ దశలో ఉన్నాడు. చేతిలో ఆఫర్స్ లేవు. ఖాళీగా ఉన్న సిద్ధార్థ మానసిక స్థితి సరిగా లేదేమోనని ఈ ట్వీట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. సున్నితమైన విషయాలపై ఆయన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి.
