Asianet News TeluguAsianet News Telugu

`జాతిరత్నాలు` డైరెక్టర్‌తో తెలుగు సినిమా.. కన్పమ్‌ చేసిన శివకార్తికేయన్‌

శివకార్తికేయన్‌ హీరోగా నటించిన `డాక్టర్‌` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. `బీస్ట్` డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 9న తెలుగు, తమిళంలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా స్ట్రెయిట్‌ తెలుగు సినిమాపై ఆయన ఓపెన్ అయ్యారు.

hero shiva kartikeyan confirm telugu movie in doctor cinema promotions
Author
Hyderabad, First Published Oct 6, 2021, 7:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తమిళ హీరోలు, దర్శకులు తెలుగులోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే రజనీకాంత్‌, కమల్ హాసన్‌, కార్తీ వంటి హీరోలు తెలుగులో సినిమాలు చేశారు. ఇప్పుడు మరికొంత మంది హీరోలు తెలుగువైపు మొగ్గుచూపుతున్నారు. పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ ఊపందుకున్న నేపథ్యంలో ఆ దిశగా అన్ని ఇండస్ట్రీల హీరోలు ప్లాన్‌ చేస్తున్నారు. కొత్తగా `దళపతి` విజయ్‌, ధనుష్‌లు తెలుగు సినిమాలను ప్రకటించారు.  

తాజాగా మరో యంగ్‌ హీరో శివకార్తికేయన్‌ సైతం తెలుగులో సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. `జాతిరత్నాలు` ఫేమ్‌ అనుదీప్‌ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నారని టాక్‌ వచ్చింది. అయితే ఇదే విషయంపై హీరో శివకార్తికేయన్‌ స్పందించారు. ఆయన హీరోగా నటించిన `డాక్టర్‌` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. `బీస్ట్` డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 9న తెలుగు, తమిళంలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు శివకార్తికేయన్‌. 

ఇందులో భాగంగా స్ట్రెయిట్‌ తెలుగు సినిమాపై ఆయన ఓపెన్ అయ్యారు. ఈ సినిమాని నిర్మాతలే అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. ఈ సినిమా కోసం తాను తెలుగు నేర్చుకుంటున్నట్టు వెల్లడించారు. తనకు కొంచెం తెలుగు వచ్చు అని, పూర్తి స్థాయిలో నేర్చుకునేందుకు ట్రై చేస్తున్నట్టు తెలిపారు. తెలుగు, తమిళంలో ఇది బైలింగ్వల్‌గా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. 

అయితే తన ప్లాన్‌లో ఈ తెలుగు సినిమా లేదని, కరోనా సెకండ్‌ వేవ్‌లో ఓ ఫ్రెండ్‌ `ఇలా ఓ కథ ఉంది` అని చెప్పాడట. `దర్శకుడికి నేను చేయగలననే నమ్మకం ఉంది. ఓకే చేశా. ఈ సినిమా చేయడానికి హీరోయిన్లందరూ నాకు స్ఫూర్తి. వాళ్లు ఓ రోజు చెన్నైలో, మరో రోజు హైదరాబాద్‌లో, ముంబైలో చిత్రీకరణ చేస్తారు. డైలాగులు రాసుకుని మీనింగ్‌ తెలుసుకుని ప్రాక్టీస్‌ చేస్తారు. నేను అలా కష్టపడాలని అనుకుంటున్నా` అని చెప్పారు శివకార్తికేయన్. 

`వరుణ్‌ డాక్టర్‌` సినిమా గురించి చెబుతూ, ప్రతి డాక్టర్‌ ఆపరేషన్‌ చేస్తారు. ఈ డాక్టర్‌ చేసే ఆపరేషన్‌ డిఫరెంట్‌. హీరో పేరు వరుణ్‌. అతను ఆర్మీ డాక్టర్‌. సొంతూరుకు వచ్చి ఏం చేశాడు? ఎందుకు చేశాడు? అనేది కథ. ట్రైలర్‌లో చూపించినట్టు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, ఆర్గాన్‌ ట్రాఫికింగ్‌ సినిమాలో ఉన్నాయి. అవి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది సినిమాలో చూడాలి. సినిమాలో ఎక్కువ ఫైట్స్‌ లేవు. రెండు ఫైట్స్‌ మాత్రమే ఉన్నాయి. హీరో, విలన్‌ మధ్య థ్రిల్‌ మూమెంట్స్‌ చాలా ఉంటాయి. నేరుగా కొట్టుకోరు. ఇదొక మైండ్‌ గేమ్‌. కొంచెం హ్యూమర్‌, కొంచెం థ్రిల్‌ ఇస్తుంది.

also read: `గని` ఫస్ట్ గ్లింప్స్ః వరుణ్‌ తేజ్‌ బ్లాక్‌ బస్టర్‌ పంచ్‌..

వరుణ్‌ పాత్ర భావోద్వేగాలను బయటకు చూపించదు. ఎప్పుడూ నవ్వడు, ఏడ్వడు, కోప్పడడు. ఎటువంటి ఎమోషన్‌ లేకుండా నటించడం చాలా కష్టం. ఈ సినిమాలో నాకు ఎదురైన ఛాలెంజ్‌ అదే. దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ నా క్లోజ్‌ ఫ్రెండ్‌. నేను 2007లో టీవీ కెరీర్‌ స్టార్ట్‌ చేస్తే... ఆ షోను నెల్సన్‌ డైరెక్ట్‌ చేశాడు. తనపై నాకున్న నమ్మకమే సినిమా ప్రొడ్యూస్‌ చేయడానికి కారణం. సినిమా ఫస్ట్‌ కాపీ వరకూ ప్రొడ్యూస్‌ చేయడం నా పని. ఆ తర్వాత మొత్తం విడుదల వ్యవహారాలు కె.జె.ఆర్‌ స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌ చూస్తారు` అని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios