యంగ్ హీరో శర్వానంద్ నటించిన రణరంగం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. ఆగష్టు 15న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు వేగంగా నిర్వహిస్తోంది. 

ఇదిలా ఉండగా నేడు కాకినాడలో రణరంగం చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అందుకోసం శర్వానంద్ కాకినాడకు బయలుదేరాడు. అనుకోకుండా మార్గమధ్యంలో శర్వాకు అనుకోని వ్యక్తి తారసపడ్డారు. అతనెవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 

రాజమండ్రి విమానాశ్రయంలో వీరిద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు. ఎయిర్ పోర్ట్ షటిల్ బస్ లో పవన్ కళ్యాణ్ తో కలసి శర్వానంద్ సెల్ఫీ తీసుకున్నాడు. వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసిన తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 

రణరంగం ట్రైలర్ లాంచ్ కోసం కాకినాడకు వెళుతుండగా అదృష్టం కొద్దీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలుసుకున్నా అని శర్వానంద్ సోషల్ మీడియాలో తెలిపాడు. ప్రస్తుతం ఈ సెల్ఫీ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాల కోసం అదే సమయంలో భీమవరం వెళుతున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Enroute Kakinada for #RanarangamTrailer launch and luckily met The Man, our Power Starrr 💥

A post shared by Sharwanand (@imsharwanand) on Aug 4, 2019 at 12:14am PDT