సారాంశం


పెళ్ళికి కొత్త నిర్వచనం చెప్పి చిక్కుల్లో పడ్డాడు షాహిద్ కపూర్. ఆయన లేటెస్ట్ కామెంట్స్ ని నెటిజెన్స్ తప్పుబడుతున్నారు. మీ అమ్మ కూడా ఇలానే చేసిందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 
 

కొన్ని సున్నితమైన విషయాల మీద స్పందించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి . ముఖ్యంగా సెలెబ్రిటీలు డిప్లొమాటిక్ గా మాట్లాడాలి. ఎవరిని నొప్పించినా మరొక వర్గంతో ఇబ్బంది తప్పదు. కాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ పెళ్లిపై వెల్లడించిన అభిప్రాయం వివాదాస్పదం అవుతుంది. ఆయన లేటెస్ట్ మూవీ బ్లడీ డాడీ ప్రమోషన్స్ లో పాల్గొన్న షాహిద్ కపూర్... పెళ్లికి ఆధారం ఒకటే. జీవితంపై స్పష్టత లేని అబ్బాయి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. అతని సమస్యలు తీర్చి, దారిలో పెడుతుంది. అతన్ని మార్చుకుంటుంది. అప్పుడు అబ్బాయి బాధ్యత గల వ్యక్తిగా తయారవుతాడు, అని చెప్పారు. 

షాహిద్ కపూర్ కామెంట్స్ ని బట్టి అబ్బాయిలు సహజంగా సోమరులు. పెళ్లయ్యాక భార్యలు వచ్చాక మాత్రమే ప్రయోజకులు అవుతున్నారన్నట్లుగా ఉంది. ఈ క్రమంలో కొందరు ఆయనపై మండిపడుతున్నారు. సంసారంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఉంటుంది. ఒకరినొకరు సరిద్దుకోవడమే పెళ్లి కాదు. నీకు బుర్ర పని చేయడం లేదనుకుంటాను. మీ అమ్మ కూడా ఇలానే చేశారా?. నువ్వు కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి రీమేక్) మూవీ చేశావని మాకు తెలుసు. ఆ పాత్ర నుండి ఇక బయటికిరా అంటూ దారుణ కామెంట్స్ పెడుతున్నారు. షాహిద్ కపూర్ అనవసరంగా పెళ్లి గురించి మాట్లాడి దొరికిపోయాడు. 

 షాహిద్ కపూర్ నటించిన బ్లడీ డాడీ విడుదలకు సిద్ధమైంది. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్ర దర్శకుడు కాగా  జూన్ 9న విడుదల కానుంది. కబీర్ సింగ్ షాహిద్ కపూర్ కి భారీ హిట్ ఇచ్చింది. సందీప్ రెడ్డి వంగా హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు. నాని హీరోగా విడుదలైన జెర్సీ చిత్రాన్ని షాహిద్ కపూర్ రీమేక్ చేశారు. ఇది మాత్రం నిరాశపరిచింది.