గతంలో ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం అందించి తనపెద్ద మనసుని చాటుకున్నారు సంపూర్నేష్‌బాబు. ఇప్పుడు మరోసారి ఆయన తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు.
టాలీవుడ్ సెన్సేషన్ హీరో సంపూర్నేష్‌బాబు(Sampoorneshbabu) మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. ఆయన ఆపదలో ఉన్న పేద వారిని ఆదుకునేందుకు ముందే ఉంటారనే విషయం తెలిసిందే. గతంలో ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం అందించి తనపెద్ద మనసుని చాటుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. చిన్నారి హార్ట్ ఆపరేషన్ కోసం సంపూర్నేష్‌బాబు తన వంతు ఆర్థిక సాయాన్ని అందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా.. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన సంకొజి లావణ్య, రమేష్ దంపతుల రెండు నెలల బాబుకి హార్ట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆ ఫ్యామిలీ కష్టం గురించి తెలుసుకున్న సంపూర్నేష్‌బాబు చిన్నారి హార్ట్ ఆపరేషన్ కోసం తనవంతుగా రూ. 25వేల ఆర్థిక సాయం అందించారు సంపూర్నేష్‌బాబు. ఆయన స్వయంగా లావణ్య, రమేష్‌ల ఇంటికెళ్లి మరీ తన ఆర్థిక సాయం అందజేయడం విశేషం. ఈ కార్యక్రమంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దీంతో సంపూర్నేష్‌బాబుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక `హృదయం కాలేయం` చిత్రంతో సంచలనం సృష్టించారు సంపూర్నేష్‌బాబు. స్పూప్ కామెడీతో ఆకట్టుకున్న ఆయన ఆ తర్వాత `సింగం 123`, `వేర్ ఈజ్ విద్యాబాలన్`, `లచ్చిందేవికి ఓ లెక్కుంది`, `భద్రంః బీ కేర్‌ఫుల్`, `కొబ్బరిమట్ట`, కాలీఫ్లవర్` చిత్రాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన `బజార్ రౌడీ` తోపాటు మరికొన్ని చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇతర చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు.
