సాయం చేసే మనసుండాలే కానీ ఆస్థులు, అంతస్తులు అవసరం లేదనడానికి హీరో సంపూర్ణేష్ బాబు నిదర్శనం. ఎటువంటి ప్రకృతి వైపరీత్యం జరిగినా సంపూర్ణేష్ బాబు నేనుండా అని మొదటి అడుగు  వేస్తారు. తనకు వచ్చే అతి తక్కువ సంపాదన నుండే దానాలు చేస్తారు. కర్ణాటక రాష్ట్రంలో సంభవించిన వరద బాధితుల సహాయార్థం సంపూర్ణేష్ బాబు విరాళం  ఇవ్వడం విశేషం.  

తాజాగా సంపూర్ణేష్ బాబు హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సహాయంగా 50వేలు ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చాడు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ గారికి సంబంధిత చెక్కును అందించారు..అకాల వర్షాలకు హైదరాబాద్ నగరంలో వరద లో ఎంతో మంది నష్ట పోయారు అని..వారికి తన వంతు సహాయం గా ఆర్థిక సహాయం అందించానాని సంపూర్ణేష్ బాబు చెప్పారు.. తన ఔదార్యం చాటుకున్నారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు అభినందించారు.. సిద్దిపేట బిడ్డ గా .సినీ ఆర్టిస్టుగా మానవత్వం చాటుకున్నారని చెప్పారు.

ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు, ప్రముఖులు వరద బాధితుల కోసం ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రభాస్, మహేష్, చిరంజీవి, పవన్ కోటి రూపాయల చొప్పున ప్రకటించారు.  ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున  తలో 50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తం తెలంగాణా సీఎం సహాయనిధికి అందించడం జరిగింది.