బ్రో మూవీ నుండి పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ లతో కూడిన పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ లుంగీ ఎత్తి కట్టి, నోట్లో బీడీ పెట్టి మాస్ కూలీ గెటప్ లో ఉన్నారు. బ్రో చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్ర చేస్తుండగా... బీడీ తాగడం వివాదాస్పదం కాదా? అని సాయి ధరమ్ తేజ్ ని ఓ ఇంటర్వ్యూలో అడిగారు.
కులం, మతం, దేవుడు, ఆచారాలు, సంప్రదాయాలు... చాలా సున్నితమైన అంశాలు. సోషల్ మీడియా యుగంలో జనాల సెంటిమెంట్స్ పట్ల మేకర్స్ జాగ్రత్తగా ఉండాలి. అందుకు ఆదిపురుష్ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మోడ్రన్ రామాయణం అంటూ ఓం రౌత్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పురాణ పాత్రల గెటప్స్, రామాయణ సన్నివేశాలను కూడా మార్చి ఏదో ప్రయోగం చేయబోయారు. సర్వత్రా విమర్శలు తలెత్తడంతో అబాసుపాలయ్యారు. న్యాయస్థానాలు సైతం అసలు సెన్సార్ ఎలా ఇచ్చారని మండిపడే పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా ప్రదర్శనలు అడ్డుకుంటే నిర్మాతకు భారీ డామేజ్ జరిగేది.
ఆదిపురుష్ విషయంలో ఎదురైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ ఓఏంజీ 2 విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా దేవుడిని కించపరిచే సన్నివేశాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే డైలాగ్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. అయితే తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్న బ్రో మూవీలోని పవన్ కళ్యాణ్ లుక్ ఒకటి వివాదాస్పదం అవుతుందనే సందేహాలు మొదలయ్యాయి.
బ్రో మూవీ నుండి పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ లతో కూడిన పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ లుంగీ ఎత్తి కట్టి, నోట్లో బీడీ పెట్టి మాస్ కూలీ గెటప్ లో ఉన్నారు. బ్రో చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్ర చేస్తుండగా... బీడీ తాగడం వివాదాస్పదం కాదా? అని సాయి ధరమ్ తేజ్ ని ఓ ఇంటర్వ్యూలో అడిగారు. దానికి సాయి ధరమ్ చెప్పిన సమాధానం కొంచెం సిల్లీగా ఉంది.
అక్కడ దేవుడు కంటే ఒక క్యారెక్టర్ గానే చూడాలి. మనం ప్రకృతిని ఆరాధిస్తాము. బీడీ కూడా ప్రకృతి నుండి వచ్చిందే కదా... కాబట్టి దేవుడు పాత్ర చేసిన పవన్ కళ్యాణ్ ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. సాయి ధరమ్ తేజ్ లాజిక్ ప్రకారం మందు, మాంసం, మాదకద్రవ్యాలు అన్నీ ప్రకృతిని నుండి వచ్చినవే. ప్రపంచంలోని ప్రతి విషయం ప్రకృతి ప్రసాదించిందే. ప్రకృతిలో మంచీ ఉంది చెడూ ఉంది. సాయి ధరమ్ తేజ్ ఆన్సర్ సంతృప్తికరంగా లేదని కొందరి వాదన.
పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో మేకర్స్ ఒకటే ఆలోచిస్తారు. ఆయన ఫ్యాన్స్ కి ఏం కావాలని. లుంగీ ఎత్తి కత్తి, నోట్లో బీడీతో చూపిస్తే ఫ్యాన్స్ వెర్రెత్తిపోతారనే ఆలోచన తప్పితే... అక్కడ పవన్ చేస్తుంది దేవుడు పాత్ర అనే ఆలోచన కూడా వచ్చి ఉండకపోవచ్చు. అలాగే ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ తన సొంత తెలివితేటలు వాడతారు. సముద్ర ఖనితో సంబంధం లేకుండా పవన్, త్రివిక్రమ్ ఈ ఆలోచన చేసి ఉండొచ్చనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక చూడాలి ఈ మోడ్రన్ దేవుడు ఏం చేయనున్నాడో. కాగా జులై 28న బ్రో విడుదల కానుంది.
