హీరో సచిన్ జోషి అరెస్ట్,100 కోట్లు మోసం

తెలుగు ప్రేక్షకులకు 'ఒరేయ్ పండు', 'మౌనమేలనోయి', 'జాక్ పాట్' మొదలైన చిత్రాలతో సుపరిచితుడైన నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈడీ విచారిస్తున్న ఓమ్ కార్ రియల్టర్స్ కేసులో జేఎం జోషి గ్రూప్ ప్రమేయాన్ని నిర్ధారించుకున్న ఈడీ అధికారులు, తదుపరి విచారణ కోసం సచిన్ జోషిని అరెస్ట్ చేశారని సమాచారం. ఓమ్ కార్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి కూడా ఉన్నాడు. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను వీరు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి.
 
hero Sachin Joshi arrested by ED jsp

అంతకుముందు దాదాపు 18 గంటల పాటు సచిన్ జోషిని విచారించిన ఈడీ అధికారులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, గోవాలో విజయ్ మాల్యా సొంతమైన కింగ్ ఫిషర్ విల్లాను గతంలో జోషి కొనుగోలు చేశాడు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్ లు, క్లబ్ లను కలిగివున్న ప్లేబాయ్ ఫ్రాంచైజీని కూడా నిర్వహిస్తున్నాడు.

గతంలోనూ గుట్కా అక్రమ రవాణా కేసులో సచిన్‌ జోషిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాన్‌ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ఆయనను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో  భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లు దొరకగా, నిందితులను విచారించిన పోలీసులు, సచిన్ జోషి ప్రమేయంపై ఆధారాలు సేకరించి, నిఘా పెంచారు. ఆపై సచిన్ ను అరెస్ట్ చేసేందుకు కొన్ని రోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి సచిన్ జోషి ముంబైలో పెట్టుబడ్డాడు. 

కాగా, బాలీవుడ్ లో సంపన్న కుటుంబాల్లో సచిన్ జోషి కుటుంబం కూడా ఉంది. సచిన్ తండ్రికి గుట్కా వ్యాపారం ఉండగా, దీనిలో ఆయన వందల కోట్లు సంపాదించారు. ఇప్పుడు సచిన్ ను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఓ వైపు మహారాష్ట్రలో, మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో వీరు గుట్కా అక్రమ దందాను సాగిస్తున్నారని తెలుస్తోంది.

నటుడిగా సచిన్ జోషి పలు తెలుగు చిత్రాల్లోనూ నటించాడన్నసంగతి తెలిసిందే. మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, జాక్ పాట్, వీరప్పన్, వీడెవడు, నెక్ట్స్ ఏంటి, అమావాస్య తదితర సినిమాల్లో నటించాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios