రాశిఖన్నాకి పెళ్లైందట.. భర్త పేరు ఏంటంటే..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 28, Aug 2018, 3:56 PM IST
hero rashikhanna husband's name  naman mishra
Highlights

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైనా పంజాబీ ముద్దుగుమ్మ రాశిఖన్నా.. తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది. స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్స్ వస్తున్నప్పటికీ అమ్మడుకి స్టార్ హీరోయిన్ క్రేజ్ మాత్రం దక్కలేదు. 

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైనా పంజాబీ ముద్దుగుమ్మ రాశిఖన్నా.. తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది. స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్స్ వస్తున్నప్పటికీ అమ్మడుకి స్టార్ హీరోయిన్ క్రేజ్ మాత్రం దక్కలేదు. 'తొలిప్రేమ' చిత్రంతో యూత్ కి బాగా దగ్గరైంది. కానీ ఎన్నో అంచనాలు పెట్టుకొని నటించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా మాత్రం నిరాశనే మిగిల్చింది.

ప్రస్తుతం ఆమె చేతుల్లో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. అలానే క్రాంతి మాధవ్ రూపొందించనున్న సినిమాలో హీరోయిన్ గా చేయడానికి అంగీకరించింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నాడు. ఇలా సినిమాలతో తన కెరీర్ లో పీక్స్ లో ఉన్న రాశిఖన్నాకి గూగుల్ పెళ్లి చేసేసింది. బహుశా ఈ విషయం రాశిఖన్నాకి కూడా తెలియదేమో.. గూగుల్ లో ఆమె గురించి తెలుసుకోవాలనే ఆతురతతో ఆమె ప్రొఫైల్ ఓపెన్ చేస్తోన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఆమె ప్రొఫైల్ లో భర్త పేరు దగ్గర నామన్ మిశ్రా అని 2017 లో వీరికి వివాహం జరిగినట్లు రాసి ఉంది. నిజంగానే రాశికి పెళ్లయిందా..? అని షాక్ అవ్వడం అభిమానుల వంతైంది. నిజానికి గూగుల్ ఇలాంటి తప్పులు గతంలో కూడా చాలా చేసింది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఈ విధంగా చేయడం సంచలనమవుతుంది. మరి ఈ విషయం రాశికి తెలిస్తే అమ్మడు ఏ రేంజ్ లో ఫైర్ అవుతుందో చూడాలి! 

loader