సినిమా సక్సెస్ అయితే హీరోలు, నిర్మాతలు దర్శకులకు బహుమతులు ఇవ్వడం కామన్ గా జరుగుతుంటుంది. ఇప్పటికే చాలా మంది హీరోలు దర్శకులకు కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చారు. అయితే హీరో రామ్ మాత్రం తన దర్శకుడికి సినిమా హిట్ కాకముందే ఖరీదైన బహుమతి ఇచ్చాడు. 

అదేంటంటే 'కాఫీ'. కాఫీ గిఫ్ట్ గా ఏంటి అనుకుంటున్నారా..? అది నార్మల్ కాఫీ అయితే రామ్ మాత్రం ఎందుకు ఇస్తాడు. అందుకే అత్యంత ఖరీదైన కాఫీని గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని గురించి పూరి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించాడు. రామ్ తనకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడని, ప్రస్తుతం తాను కాఫీ తాగుతున్నట్లు తెలిపాడు.

'కోపి లువాక్' అనే కాఫీ ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రత్యేకమైంది. దీని ధర కూడా చాలా ఎక్కువ.. గూగుల్ లో దీని ధర చూస్తే షాక్ అవుతారని అంటున్నాడు పూరి. కోపి లువాక్ ప్రస్తుతం ధర 10 గ్రాములు రూ.2633. ఇక సినిమా విషయానికొస్తే.. రామ్ హీరోగా పూరి 'ఇస్మార్ట్ శంకర్'  సినిమాను రూపొందిస్తున్నాడు.

సినిమా మొదటి షెడ్యూల్ ఫిబ్రవరి 21న జరగనుంది. మేలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను ఛార్మీ, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.