సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ని బట్టి రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. వరుసగా విజయాలు వస్తే రెమ్యునరేషన్ ఎంతైనా డిమాండ్ చేస్తుంటారు. సక్సెస్ లు లేకపోతే మాత్రం నిర్మాత చెప్పిందే రేటు. ఒక్కోసారి హిట్లు ఉన్నా సరే రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తూంటుంది.

హీరో రామ్ పరిస్థితి కూడా ఇంతే అని సమాచారం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ కి ఒక్క హిట్టు కూడా లేకపోవడంతో ఆయనతో రిస్క్ చేసే నిర్మాతలు లేక ఆయనే సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు రామ్ కూడా ఈ సినిమా కోసం తనవంతు సహాయం చేయాలనుకుంటున్నాడట. రామ్ పారితోషికం రెండున్నర నుండి మూడు కోట్ల వరకు ఉంటుంది. 

ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ ని సగానికి సగం తగ్గించుకుంటున్నాడని సమాచారం. అది కూడా పూరి కోసమేనని తెలుస్తోంది. సినిమా హిట్ అయ్యి లాభాలు వస్తే అప్పుడు రామ్ కి పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ చెల్లించే అవకాశాలు ఉన్నాయి.