ఈ ఎన్నికల్లో ఓటేసిన సెలబ్రెటీలంతా.. తమ వేలికి సిరా గుర్తును చూపిస్తూ.. సెల్ఫీ దిగి.. సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
టాలీవుడ్ హీరో తెలంగాణ ఎన్నికలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓటేసిన సెలబ్రెటీలంతా.. తమ వేలికి సిరా గుర్తును చూపిస్తూ.. సెల్ఫీ దిగి.. సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
వాళ్లలాగే.. హీరో రామ్ కూడా తన ట్విట్టర్ లో ‘‘నాది నాదే.. మరి మీది..?’’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి ఆయన అభిమానులు బాగా స్పందించారు. వాళ్లు కూడా మేము కూడా ఓటు వేశాం అంటూ.. రిప్లై ఇచ్చారు. అయితే.. ఓ అభిమాని మాత్రం ‘‘మాది ఆంధ్రాలే’’ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పై రామ్ స్పందించారు.
‘‘ అదీ మనదే తమ్ముడూ..ఒక్క సీఎం సరిపోలేదని ఇద్దరికి ఇచ్చాం అంతే.. విడదీసి ఇచ్చాం.. విడిపోలేదు. రెండూ మనవే’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా.. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. రామ్ ట్వీట్ కి నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు.
