యంగ్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో గాడిన పడ్డాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. తెలంగాణ మాస్ పోరగాడిగా రామ్ అదరగొట్టాడు. రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ చిత్రం 75కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టడం విశేషం. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పూరి మరియు ఆయన పార్టనర్ ఛార్మి సెటిల్ అయ్యారు. ఈ మూవీ తరువాత రామ్ తెలివిగా రీమేక్ ఎంచుకున్నాడు. తమిళ్ హిట్ మూవీ తాడం రీమేక్ లో ఆయన నటిస్తున్నారు. 

కెరీర్ లో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా క్రైమ్ థ్రిల్లర్ గా రెడ్ మూవీ తెరకెక్కుతుంది. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ తెరకెక్కిస్తున్నారు. నివేదా పేతు రాజ్, మాళవిక శర్మ మరియు అమృతా అయ్యర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హీరో రామ్ ఈ మూవీ విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారని సమాచారం. ఐతే రామ్ రెడ్ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. దీనితో రెడ్ మూవీ విడుదలపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. 

రెండ్ మూవీకి ఓ టి టి సంస్థల నుండి ఫాన్సీ ఆఫర్స్ వస్తున్నాయట. ఐతే చిత్ర నిర్మాతలు ఓ టి టి విడుదలకు ఆసక్తి చూపడడం లేదట. మరికొద్దిరోజులలో థియేటర్స్ తెరచుకోకున్నాయని వార్తలు వస్తుండగా థియేటర్ విడుదలకే నిర్మాతలు మొగ్గుచూపుతున్నారట. ఇక హీరో రామ్ కి ఓ టి టి విడుదలపై అసలు ఆసక్తి లేదట. రెడ్ మూవీని కొంచెం లేటైనా థియేటర్స్ లోనే విడుదల చేయాలి అంటున్నారట. స్రవంతి ఫిల్మ్స్ బ్యానర్ వారిదే కావడంతో రెడ్ ఓ టి టిలో వచ్చే ఆస్కారం లేదట.