తెలంగాణాలో 119 శాసనసభా నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. నిన్న పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

అధిక శాతం ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలో సెలబ్రిటీలు సిరా చూపిస్తూ దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను కూడా ఓటు వేయాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో హీరో రామ్ కూడా సెల్ఫీని పోస్ట్ చేస్తూ.. 'నాది నాదే.. మరి మీది..?' అని ప్రశ్నించారు.

దీనికి ఓ అభిమాని 'మాది ఆంద్రలే' అని బదులిచ్చాడు. ఇది చూసిన రామ్.. 'అదీ మనదే తమ్ముడు.. ఒక్క ముఖ్యమంత్రి సరిపోలేదని ఇద్దరికి ఇచ్చాం అంతే.. విడదీసి ఇచ్చాం.. విడిపోలేదు. రెండు మనవే' అంటూ సమాధానమిచ్చాడు.

రామ్ జవాబుకి ఫిదా అయిన నెటిజన్లు కరెక్ట్ గా చెప్పారంటూ ఆయనను మెచ్చుకున్నారు. ఆంధ్ర, తెలంగాణా ఏంటి.. రెండు మనవే అంటూ ట్వీట్లు చేస్తున్నారు.