దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఈ మూవీ నుండి రామ్ చరణ్ లుక్ ఒకటి వైరల్ గా మారింది.  

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ పొలిటికల్ థ్రిల్లర్స్ కి పెట్టింది. ఆయన ప్రతి మూవీలో సోషల్, పొలిటికల్ అంశాలు ఉంటాయి. అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఒకే ఒక్కడు చరిత్ర తిరగరాసింది. అర్జున్ కెరీర్లో భారీ హిట్ గా నిలిచింది ఒకే ఒక్కడు. చాలా కాలం తర్వాత గేమ్ ఛేంజర్ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా శంకర్ తెరకెక్కిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నాడని సమాచారం. 

రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. పొలిటీషియన్ గా, ఎన్నికల అధికారికగా ఆయన కనిపించనున్నారట. చిత్రీకరణ దశలో ఉన్న గేమ్ ఛేంజర్ నుండి రామ్ చరణ్ లుక్ ఒకటి వైరల్ అవుతుంది. రామ్ చరణ్ బ్యాక్ గ్రౌండ్ లో గాంధీజీ ఫోటో ఉండగా కుర్చీలో కూర్చున్న రామ్ చరణ్ ఫెరోషియస్ గా ఉన్నారు. ఈ లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. 

శంకర్ ఏకకాలంలో భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ చిత్రాలు చిత్రీకరిస్తున్నారు. అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుంది. లేదంటే గేమ్ ఛేంజర్ 2024 సంక్రాంతి బరిలో ఉండాల్సింది. కాగా గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేయాల్సింది చాలా ఉంది. ఈ క్రమంలో విడుదల తేదీ పై ఎలాంటి అవగాహన లేదు. రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీగా గేమ్ ఛేంజర్ తెరకెక్కిస్తున్నారు. 

రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక రోల్స్ చేస్తున్నారు.