నా చావుకు ఆ ముగ్గురే కారణం... వైరల్ గా చరణ్ అభిమాని సూసైడ్ నోట్
రామ్ చరణ్ అభిమాని ఒకరు తీవ్ర నిరాశకు గురయ్యాడు. సూసైడ్ నోట్ రాసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.

దర్శకుడు శంకర్ రెండు పడవల ప్రయాణం రామ్ చరణ్ చిత్రానికి శరాఘాతంగా మారింది. గేమ్ ఛేంజర్ షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతుంది. రెండు మూడు నెలల్లో భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసి గేమ్ ఛేంజర్ మీద ఫోకస్ చేస్తాడని అనుకుంటే, దాదాపు ఏడాది కాలంగా ఆ ప్రాజెక్ట్ లో లాక్ అయ్యాడు. రామ్ చరణ్ మూవీ మీద ఆయనకు శ్రద్ధ కూడా తగ్గిందని సమాచారం. దిల్ రాజు తన బ్యానర్లో 50వ చిత్రంగా గేమ్ ఛేంజర్ నిర్మిస్తున్నారు. ఇంకా సగం షూటింగ్ కూడా కాలేదట. బడ్జెట్ సైతం పరిమితులు దాటిపోతుంది.
శంకర్ మీద రామ్ చరణ్, దిల్ రాజు గుర్రుగా ఉన్నారు. అయితే ప్రాజెక్ట్ మధ్యలో ఉంది. గొడవల వలన మరింత నష్టపోవాల్సి వస్తుంది. అందుకే గమ్మున ఉంటున్నారు. అయితే అభిమానుల్లో అసహనం పీక్స్ కి చేరింది. ఓ అభిమాని ఏకంగా విడుదల తేదీ ప్రకటించాలని సూసైడ్ నోట్ రాశాడు. ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం గేమ్ ఛేంజర్ యూనిట్ నిర్లక్ష్యమే అంటున్నాడు.
రెండేళ్లుగా షూటింగ్ జరుగుతుంది. పలుమార్లు వాయిదా పడింది. సినిమా ఎంత వరకు కంప్లీట్ చేశారో? ఎప్పుడు విడుదల చేస్తారో? చెప్పరు. అందుకే చనిపోవాలని అనుకుంటున్నాను. మరో మూడు రోజుల్లో గేమ్ ఛేంజర్ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించాలి. లేని పక్షంలో నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా చావుకు శంకర్, దిల్ రాజు, ఎస్వీ క్రియేషన్స్ కారణం. రామ్ చరణ్ అన్న ఐ మిస్ యూ... అని లేఖలో రాసుకొచ్చాడు.
ఈ అభిమాని పేరు బాబు గౌడ్ అని తెలుస్తుంది. కాగా గేమ్ ఛేంజర్ ఏకంగా 2025కి వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ రెండు భిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.