ఆర్ ఆర్ ఆర్ హిట్ తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ఆర్ సి 15 షూటింగ్ చకచకా పూర్తి చేస్తున్నారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్రిపేర్ అవుతున్న రామ్ చరణ్ హెవీ వర్క్ అవుట్స్ చేస్తున్నారు.  


భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. రామ్ చరణ్ 15వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా రెండు మూడు భిన్న గెటప్స్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. పీరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంటుంది అంటున్నారు. రామ్ చరణ్ వింటేజ్ లుక్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. 

శంకర్ భారతీయుడు 2 షూటింగ్ తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో ఆర్ సీ 15 నెమ్మదించినట్లు సమాచారం. ఏక కాలంలో రెండు చిత్రాల షూటింగ్స్ లో శంకర్ పాల్గొంటున్న నేపథ్యంలో ఆలస్యం అవుతుంది. కాగా ఈ చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ కి రామ్ చరణ్ ప్రిపేర్ అవుతున్నారట. దాని కోసం ఆయన హెవీ వర్క్ అవుట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. 

View post on Instagram

దిల్ రాజు నిర్మాతగా భారీ ఎత్తున ఆర్ సీ 15 తెరకెక్కుతుంది. కియారా అద్వానీ హీరోయిన్.గతంలో కియారా వినయ విధేయ రామ మూవీలో రామ్ చరణ్ కి జంటగా నటించారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబోపై విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంతో రామ్ చరణ్ మరో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.