రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో భాగంగా ఆరెంజ్ మూవీ రీరీలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి.  

మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే. ఈ జన్మదినం అభిమానులకు చాలా ప్రత్యేకం. కెరీర్లో అరుదైన మైలురాళ్ళు ఆయన చేరుకున్నారు. ఆయన నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ గెలుచుకుంది. ఆస్కార్ వేడుకల్లో రామ్ చరణ్ తమ టీమ్ తో పాటు పాల్గొన్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. HCA స్పాట్ లైట్ అవార్డుకి ఎంపిక చేయడమైంది. అలాగే గుడ్ మార్నింగ్ అమెరికా షోకి హాజరైన తొలి భారతీయ నటుడిగా రామ్ చరణ్ రికార్డులకు ఎక్కారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హాలీవుడ్ మేకర్స్ తో చర్చలు జరిగాయని త్వరలో ప్రాజెక్ట్ ప్రకటిస్తానంటూ రామ్ చరణ్ వెల్లడించారు. ఒక్క సినిమా చరణ్ ఇమేజ్ ఎల్లలు దాటించింది. ఈ విజయాలన్నీ చరణ్ బర్త్ డే సందర్భంగా జరుపుకోనున్నారు. ఇక స్టార్ హీరోల బర్త్ డేకు వారి పాత చిత్రాలను విడుదల చేయడం ట్రెండ్ గా మారింది. సాధారణంగా బ్లాక్ బస్టర్ చిత్రాలు రీరిలీజ్ కి ఎంచుకుంటారు. అందుకే మగధీర అనుకున్నారు. ఎందుకో మనసు మార్చుకొని రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ ఆరెంజ్ లైన్లోకి తెచ్చారు. 

మార్చి 25, 26 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరెంజ్ చిత్ర ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ క్రమంలో నేడు ట్రైలర్ విడుదల చేశారు. బొమ్మరిల్లు చిత్రంతో పరిశ్రమను ఆకర్షించిన భాస్కర్ ఆరెంజ్ చిత్ర దర్శకుడు. ఒక్కరినే ఎల్లకాలం ప్రేమించలేం. మొదట్లో ఉన్నంత స్ట్రాంగ్ గా ప్రేమ ఏళ్ల తరబడి ఉండదనే భిన్నమైన పాయింట్ తో ఆరెంజ్ ని భాస్కర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో పాటలు మాత్రం అద్భుతం. హరీష్ జయరాజ్ కెరీర్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. 

12 ఏళ్ల నాటి ఆరెంజ్ మూవీని రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేయనున్నారు. జెనీలియా, షాజహాన్ పదంసీ హీరోయిన్స్ గా నటించారు. ప్రకాష్ రాజ్ కీలక రోల్ చేశారు. నాగబాబు, వెన్నెల కిషోర్ ఇతర పాత్రల్లో నటించారు. నాగబాబు ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు.