తారలు తరలి వస్తున్నారు. మొదట్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నెమ్మదిగా వచ్చిన సెలబ్రిటీలు ఇప్పుడు కాస్త జోరు పెంచారు. వరుసగా యంగ్‌ హీరోలు ఓటు హక్కుని వినిపించుకునేందుకు ముందుకు వస్తున్నారు. తమ సామాజిక బాధ్యతని, ఓటు విలువని చాటుతున్నారు. 

`ఇస్మార్ట్ శంకర్‌` ఫేమ్‌ హీరో రామ్‌ పోతినేని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో షేక్‌ పేటలోని ఎమ్మార్వో ఆఫీస్‌లో తమ ఓటుని వేశారు. మాస్క్ ధరించి, కరోనా నియమాలను పాటిస్తూ ఓటుని వేశారు. ఓ పోలీస్‌ రామ్‌కి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించినా కాదని, నమస్కారం పెట్టడం విశేషం. కరోనా వెళ్లలేదు ఇంకా ఉందన్నారు.

ఈ సందర్భంగా రామ్‌ మీడియా ముందు మాట్లాడుతూ, `ఓటు వేయడం మన బాధ్యత, మన హక్కు, మన పవర్‌. ఓటు వేయాలని చెబితే జరిగేది కాదు, రియలైజ్‌ అయి రావాలి. తమ బాధ్యతని చాటుకోవాలి` అని చెప్పారు.