హీరో రాజశేఖర్ సోషల్ మీడియా ద్వారా ఓ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా సోకిందంటూ వస్తున్న వార్తలు నిజమంటూ ఆయన స్పష్టం చేశారు. రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. 

ఆ వార్త నిజమే...జీవిత, పిల్లలు మరియు నేను కరోనా బారిన పడ్డాము. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాము. పిల్లలు బాగున్నారు, నేను, జీవితా కూడా కొంచెం బెటర్ గా ఫీలవుతున్నాం. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాం అని ఆయన ట్విట్టర్ లో సందేశం పోస్ట్ చేశారు. 

దీనితో భార్య జీవితామరియు కూతుళ్లు శివాని, శివాత్మికలకు కూడా కొరోనా సోకినట్లు అర్థం అవుతుంది. ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా రాజశేఖర్ కుటుంబం మొత్తానికి కరోనా సోకడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. రాజమౌళి కుటుంబం సైతం ఇలాగే కరోనా బారినపడి చికిత్స తరువాత కోలుకోవడం జరిగింది. 

ఇక గత ఏడాది రాజశేఖర్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో కల్కి మూవీ చేశారు. అలాగే ఆయన చిన్న కూతురు శివాత్మిక దొరసాని మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పెద్ద అమ్మాయి శివాని ఓ చిత్రంలో నటిస్తున్నారు. శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేస్తుంది. రాజశేఖర్ ట్వీట్ చూసిన ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.