ప్రభాస్ ఈసారి కూడా ఓటు వేయలేదు. ప్రభాస్ ఎందుకు ఓటు వేయరనే చర్చ జరుగుతుంది. దీని మీద విశ్లేషణ చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోగి వస్తున్నాయి.  

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ముఖ్యంగా సెలెబ్రిటీలు దీన్ని సామజిక బాధ్యతగా భావించాలి. ఓటు వేయడం వేయడం ద్వారా తన అభిమానులకు స్ఫూర్తిగా నిలవాలి. ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రతిసారి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. సామాన్యుల వలె క్యూ లైన్లో నిలబడి ఓటు వేస్తారు. 

అయితే ఒక్క ప్రభాస్ మాత్రం ఓటు వేయరు. ఆయన ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన దాఖలాలు లేవు. అసలు ప్రభాస్ ఎందుకు ఓటు వేయరు? ఆయనకు ఓటు లేదా? అనే సందేహాలు ఉన్నాయి. ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ హీరో రాజశేఖర్ వీడియోను వైరల్ చేస్తూ ప్రభాస్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. రాజశేఖర్ తలకు క్యాప్ తో వచ్చాడు. దాంతో ఆయనే ప్రభాస్ అని ట్రోల్ చేస్తున్నారు. 

ప్రభాస్ బీజేపీ పార్టీకి అనుకూలుడు అనే వాదన ఉంది. కారణం... వాళ్ళ పెదనాన్న కృష్ణంరాజు అదే పార్టీలో ఉన్నారు. కరోనా సంక్షోభంలో ప్రభాస్ బీజేపీ ప్రభుత్వానికి మూడు కోట్లు సహాయం చేశాడు. మరి బీజేపీకి ఓటు వేయడానికైనా ప్రభాస్ రవళి కదా. ప్రభాస్ ఓటు హైదరాబాద్ లో ఉంది. ఆయన మాత్రం ఔట్ వేయడానికి రాడు. దీనికి ఒక కారణం ఉంది. ప్రభాస్ చాలా సిగ్గరి. ఆయన పబ్లిక్ లోకి అవసరం ఉంటే మినహాయించి రాడు. అలాగే నేను వేసే ఒక్క ఓటు వలన మారిపోయేది ఏమీ లేదని ప్రభాస్ భవిస్తూ ఉండవచ్చు. 

ఇక టాలీవుడ్ స్టార్స్ లో ఎవరు ఓటు వేశారని గమనిస్తే.. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ను వేశారు. ఆయన ఎన్డీయే కూటమి ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ కి సైకిల్ గుర్తు మీద ఓటేసి మద్దతు తెలిపాడు. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, చిరంజీవి, అల్లు అర్జున్ హైదరాబాద్ లో ఓటేశారు. వాళ్లు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్నారు.