Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హీరోలకు మించి సంపాదిస్తున్న ప్రభాస్ డూప్... రోజుకు ఎన్ని లక్షలో తెలుసా?


హీరో ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ డూప్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడగా... అదే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అతని సంపాదన స్టార్ హీరోలకు మించిపోయిందనేది ఇండస్ట్రీ టాక్... 
 

hero prabhas dupe charges huge producers paying thirty lacks for day ksr
Author
First Published Feb 23, 2024, 6:49 AM IST | Last Updated Feb 23, 2024, 6:49 AM IST

సినిమాల్లో డూప్ వాడటం వెరీ కామన్. హీరో డ్యూయల్ రోల్ చేస్తే కాంబినేషన్ సన్నివేశాల్లో డూప్ ని వాడతారు. ముఖ్యంగా రిస్కీ స్టంట్స్, పోరాట సన్నివేశాల్లో డూప్స్ తప్పనిసరి. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఈ సాంప్రదాయం ఉంది. జాకీ చాన్, టామ్ క్రూజ్ వంటి కొందరు హీరోలు మాత్రమే ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు. కాగా ఈ మధ్య ప్రభాస్ మీద ఒక రూమర్ గట్టిగా వినిపిస్తోంది. 

కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ప్రభాస్ ఎక్కువగా డూప్ మీదే ఆధారపడుతున్నాడట. ప్రభాస్ చేసేవి అన్నీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్. ఆయనకు మోకాలి నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు ఉన్నాయట. ఈ క్రమంలో డూప్ తప్పనిసరి అవుతున్నాడట. సలార్ మూవీలో డూప్ తో చాలా సీన్స్ లాగించేశారట. 

ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2829 AD చిత్రం చేస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కల్కి లో పోరాట సన్నివేశాలు ఎక్కువగానే ఉండొచ్చు. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ డూప్ ఛార్జ్ చేసే మొత్తం ఓ స్టార్ హీరో తీసుకునే రెమ్యూనరేషన్ కి సమానం అంటున్నారు. రోజుకు ఏకంగా రూ. 30 లక్షలు తీసుకుంటున్నాడట. 

సాధారణంగా డూప్ లకు రోజుకు లక్ష ఇస్తే ఎక్కువ. ముప్పై లక్షలు అంటే మామూలు విషయం కాదు. ప్రభాస్ డూప్ ఒక్కో సినిమాకు పది రోజులు పని చేసినా... మూడు కోట్లు చెల్లించాలన్న మాట. మరి ఈ ప్రచారం లో ఎంత వరకు నిజం ఉందో కానీ సోషల్ మీడియాను ఊపేస్తోంది. కాగా బాహుబలి లో సైతం ప్రభాస్ డూప్ ని వాడటం విశేషం. ఇక ప్రభాస్ విషయానికి వస్తే... సినిమాకు ఆయన రూ. 100 నుండి రూ. 150 కోట్లు తీసుకుంటున్నాడు. కల్కి మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వకీల్ సాబ్ అనంతరం సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ చేస్తారని సమాచారం. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios